నన్ను ఆ నిర్మాత ఒప్పించాలని చూసాడు.. నేను అదే చేశా : రకుల్

Submitted by admin on Wed, 12/13/2017 - 11:06

నేను సినిమాల ఎంపికలో చాల పర్ఫెక్ట్ గా ఉంటాను, కేవలం సెలెక్టెడ్ సినిమాలు మాత్రమే చేస్తాను.. డబ్బుకోసం ఎప్పుడు తహా తహాలాడలేదు అని టాలీవుడ్ భామ రకుల్ ప్రీత్ సింగ్ అన్నారు.. నిన్న ఒక ఇంటర్వ్యూ లో భాగంగా ఆమె మాట్లాడుతూ నాకు కొంచెం కోపం ఎక్కువే, ఆ కోపమే నన్ను మొన్నామధ్య నిర్మాతను తిట్టే స్థాయికి వెళ్లిందని తెలిపింది అయితే అప్పుడు నేను కోపం తెచ్చుకోవడానికి కారణం ఉందంటూ. నాతో సినిమా చేస్తానంటూ ఓ నిర్మాత వచ్చారు. కథ కూడా పూర్తిగా చెప్పలేదు. అడ్వాన్స్ ఇస్తాను అగ్రిమెంట్‌ చేసుకుందామని అన్నారు. కథ వినకుండా ఎలా ఒప్పుకుంటాను. అదే విషయం చెప్పాను. అయినా వినకుండా నన్ను ఒప్పించడానికి ప్రయత్నించడంతో సహనం కోల్పొయి అరవడం జరిగింది. ఆ తరువాత నా ప్రవర్తనకి సారీ చెప్పాను. అది వేరే విషయం. ఇప్పటి వరకూ నేను ఏ నిర్మాతతోనూ అలా ప్రవర్తించలేదు. దాంతో అది కాస్త పెద్ద ఇష్యూ అయిపోయింది. మంచి కథతో రండి తప్పకుండా చేస్తాననిన ఆ నిర్మాతకి సర్ది చెప్పి పంపించేశాను. అని సెక్సీ భామ రకుల్ ప్రీత్ తెలిపింది..

ఇక పెళ్లి విషయమై రకుల్ ఇలా స్పందించారు నేను ఎలాగో కొంచెం ఎత్తుగా ఉంటాను కాబట్టి సహజంగానే ఆరడుగుల ఎత్తు వుండే అబ్బాయినే పెళ్లి చేసుకుంటాను, అయినా ఇంత వరకూ నాకు పెళ్ళి ఆలోచన రాలేదు. ఒకవేళ తెలుగు ప్రాంతానికి చెందిన అబ్బాయిని చేసుకుని సమంత లాగా తెలుగింటి కోడలని అవుతానేమో! తెలుగింటి కోడలయితే తప్పేంటి? భవిష్యత్తులో ఏం జరుగుతుందో చెప్పడానికి నేనేమీ జ్యోతిష్కురాలిని కాదు కాదని రకుల్ అన్నారు.. మరి ఆమె ఎ ప్రాంతానికి చెందిన వ్యక్తిని పెళ్లి చేసుకుంటారో ఎవరిని పెళ్లి చేసుకుంటారో చూడాలంటె మరి కొద్దీ రోజులు ఆగాల్సిందే..!

English Title
tollywood-heroine-rakhul-preth-sing-interview

MORE FROM AUTHOR

RELATED ARTICLES