చంద్రబాబుపై సంచలన వ్యాఖ్యలు చేసిన పోసాని

Submitted by arun on Mon, 06/11/2018 - 16:37
posani

ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుపై మరోసారి సినీ నటుడు పోసాని కృష్ణమురళి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్టీఆర్‌కి వెన్నుపోటు పొడిచి సీఎం అయ్యారన్న పోసాని....  23మంది వైసీపీ ఎమ్మెల్యేలను సిగ్గులేకుండా కొనుగోలు చేశారని మండిపడ్డారు. ఇతర పార్టీ ఎమ్మెల్యేలకు తెలుగుదేశం జెండా కప్పడం అభివృద్ధిలో భాగమా అంటూ ప్రశ్నించారు. ప్రత్యేకహోదా వద్దన్న చంద్రబాబు ఇప్పుడు ప్రధాని మోదీని విమర్శించటం ఏంటని నిలదీశారు. ప్రతిపక్ష నేత జగన్ అవినీతి వ్యవహారం కోర్టులే చూసుకుంటాయని, చంద్రబాబు తన అవినీతిపై నార్కోఎనాలసిస్ టెస్ట్‌కు సిద్ధమా అంటూ మరోసారి పోసాని ప్రశ్నించారు. కాంగ్రెస్‌లో ఓడిపోయి టీడీపీలో చేరిన చంద్రబాబు ఆ పార్టీని ఎన్టీఆర్ నుంచి లాక్కున్నాడని, ఎన్టీఆర్ చావుకు చంద్రబాబే కారణమని పోసాని కృష్ణమురళి ఆరోపించారు.
 

English Title
Tollywood Actor Posani Krishna Murali Fires on AP CM Chandrababu Naidu

MORE FROM AUTHOR

RELATED ARTICLES