ఆధ్యాత్మిక కేంద్రంలో అలజడికి కారకులెవరు?

ఆధ్యాత్మిక కేంద్రంలో అలజడికి కారకులెవరు?
x
Highlights

తిరుమలను వివాదాల్లోకి నెట్టిందెవరు? భక్తుల మనోభావాలతో ఆడుకుందెవరు? తప్పు చేయడం... ఆపై నాలుక కరుచుకోవడం.. బాధ్యత గల స్థానంలో ఉండి... ఎవరు ఏం...

తిరుమలను వివాదాల్లోకి నెట్టిందెవరు? భక్తుల మనోభావాలతో ఆడుకుందెవరు? తప్పు చేయడం... ఆపై నాలుక కరుచుకోవడం..
బాధ్యత గల స్థానంలో ఉండి... ఎవరు ఏం చేస్తున్నారు? రాష్ట్రాలకు, కేంద్రానికి ఏవో గొడవలున్నాయ్‌ సరే...!! దాన్ని దేవదేవుడికి ఆపాదించి... రాజకీయ రంగు పులుముతారా? లేఖ రాయడం... ఆపై యూ టర్న్‌ తీసుకోవడం... కేంద్రంపై ఓ సెక్షన్‌ ఆఫ్‌ మీడియా నిందారోపణలు చేయడం... తామే పత్తిత్తులమని ప్రచారం చేసుకోవడం... ఏంటి ఇదంతా? సగటు భక్తుడి మనోభావాలతో ఆడుకునే హక్కు ఎవరికి ఎవరిచ్చారు? మొత్తంగా కావాలని కేంద్రమే చేసిందన్న... అపోహల వెనుక అసలు వాస్తవాలు ఏంటి?

అసలేం జరిగింది? ఏడుకొండలు ఎందుకు వివాదాస్పదమయ్యాయి. సప్తగిరులతో పాటు... తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన అనుబంధ ఆలయాలను పురావస్తు శాఖ తన ఆధీనంలోకి తీసుకుంటే ఏమవుతుంది? కేంద్రం కావాలని గిల్లికజ్జాలు పెట్టుకుంటందంటూ నెత్తినోరు కొట్టుకున్న ఆ సందర్భానికి అసలు సాక్ష్యం ఏంటి? తిరుమల ఈవో్‌ను కోట్‌ చేస్తూ కేంద్రపురావస్తు శాఖ రాసిన లేఖ మాత్రం సంచలనం సృష్టించింది. రాజకీయ వివాదంగా మారిపోయింది. కలియుగ వైకుంఠమైన తిరుమలపై కేంద్రం కన్నువేసిందంటూ ఆందోళన వ్యక్తమైంది. రోజంతా ప్రచారం సాగడంతో రాత్రికి రాత్రే ఆ లేఖను ఉపసంహరించుకుంది. చిరవకు టీటీడీ ఈవో ఏకే సింఘాల్‌ చెప్పడంతో వివాదం సమసిపోయి ఉండవచ్చు గాక. కానీ అసలు నిజాన్ని మాత్రం మరుగునపెట్టలేం... ఎంతోకాలం దాచలేం.!! అసలు పురావస్తు శాఖ పరిధిలోకే వెళ్తే గనుక ఏం జరగుతోంది?

అసలు నిజాలు కనిపించకుండా... వివాదానికి ఆజ్యం పోసిందెవరు? వివాదాన్ని మనమెలా అర్థం చేసుకున్నా... ఎవరేమన్నా... అనకున్నా... ఇది కచ్చితంగా కోట్లాది మంది భక్తుల మనోభావాలకు సంబంధించిందే. తిరుమలలో ఏం జరుగుతుందన్న ఆసక్తి కలగడం సహజం. వెంకన్న ఆలయంపై అనవసర వివాదం సృష్టించిన కేంద్రం... తనకు తానే దోషిగా నిలబడిందా? ఒకరి మీద ఒకరు నింద వేసుకుంటే... అసలు నిజాలు దాగుతాయా? ఇంతకీ ఈ కుట్ర వెనుక ఉన్న కుతంత్రం ఏంటి?

Show Full Article
Print Article
Next Story
More Stories