‘ముక్కోటి’కి ముస్తాబైన తిరుమల

‘ముక్కోటి’కి ముస్తాబైన తిరుమల
x
Highlights

వైకుంఠ ఏకాదశికి తిరుమల క్షేత్రం ముస్తాబైంది. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడిని దర్శించుకునేందుకు భారీగా భక్తులు తరలి వస్తున్నారు. భక్తుల కోసం టీటీడీ...

వైకుంఠ ఏకాదశికి తిరుమల క్షేత్రం ముస్తాబైంది. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడిని దర్శించుకునేందుకు భారీగా భక్తులు తరలి వస్తున్నారు. భక్తుల కోసం టీటీడీ ఏర్పాట్లు చేసింది. సుమారు 43 గంటల పాటు సామాన్య భక్తులకు దర్శన భాగ్యం కల్పిస్తున్నారు. పెథాయ్ తుపాను ప్రభావం తిరుమలకు ఉందన్న హెచ్చరికలతో ముందస్తు ఏర్పాట్లు చేసింది టీటీడీ. వైకుంఠ ఏకాదశి, ద్వాదశిని పురస్కరించుకొని తిరుమల తిరుపతి దేవస్థానం భారీ ఏర్పాట్లు చేసింది. కలియుగ ప్రత్యక్షదైవం శ్రీనివాసుడిని వైకుంఠ ఏకాదశి రోజున దర్శించుకోవాలని వేలాదిగా భక్తులు తిరుమలకు చేరుకుంటున్నారు. వైకుంఠ ఏకాదశి రోజున స్వామివారి దర్శనం చేసుకుంటే పాప విముక్తి కలుగుతుందని భక్తులు భావిస్తారు. స్వామిని సేవించుకునేందుకు ముక్కోటి దేవతలూ వైకుంఠానికి చేరుకుని ఉత్తర ద్వారం తెరచుకునే క్షణాల కోసం వేచి చూస్తుంటారు. అందుకే దేవతలతో పాటు స్వామిని ఉత్తర ద్వారం నుంచి వైకుంఠ ఏకాదశి నాడు దర్శించుకోవాలని భక్తులు కోరుకుంటారు.

భక్తుల రద్దీ దృష్ట్యా టీటీడీ సకల ఏర్పాట్లు కల్పించింది. నారాయణగిరి గార్డెన్స్ లో జర్మనీ టెక్నాలజీతో షెడ్లను నిర్మించారు. తొలిసారి ఆలయ నాలుగు మాడ వీధుల్లో భక్తుల కోసం తాత్కాలిక షెడ్లను ఏర్పాటు చేశారు. 18వ తేదీ ఉదయం 10 గంటల నుండి వైకుంఠ ఏకాదశి దర్శనానికి భక్తులను కంపార్ట్ మెంట్లలోకి అనుమతిస్తారు. వేకువజాముకు ముందుగా విఐపీలను దర్శనానికి అనుమతిస్తారు. ఉదయం ఐదు గంటల నుండి నిరాటకంగా 19వ తేదీ అర్ధరాత్రి వరకు దాదాపు 43 గంటల పాటు సామాన్య భక్తులను దర్శనానికి అనుమతించనున్నారు. రెండు రోజుల్లో 1లక్ష 70వేల మంది భక్తులకు శ్రీవారి దర్శనం కల్పిస్తామని చెప్పారు. వాతావరణ పరిస్థితులు ఇటు భక్తులు, అటు టీటీడీలో ఆందోళన కలిగిస్తోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories