నితిన్ ఈ సారి రూట్ మార్చాడు

నితిన్ ఈ సారి రూట్ మార్చాడు
x
Highlights

క‌లిసొచ్చిన కాంబినేష‌న్‌లో మ‌ళ్లీ మ‌ళ్లీ ప‌నిచేయ‌డం అనేది సినిమా ప‌రిశ్ర‌మ‌లో స‌ర్వ‌సాధార‌ణం. యువ క‌థానాయ‌కుడు నితిన్ కూడా ఇందుకు మిన‌హాయింపు కాదు....

క‌లిసొచ్చిన కాంబినేష‌న్‌లో మ‌ళ్లీ మ‌ళ్లీ ప‌నిచేయ‌డం అనేది సినిమా ప‌రిశ్ర‌మ‌లో స‌ర్వ‌సాధార‌ణం. యువ క‌థానాయ‌కుడు నితిన్ కూడా ఇందుకు మిన‌హాయింపు కాదు. త‌న తొలి చిత్రం 'జ‌యం'లో హీరోయిన్‌గా న‌టించిన స‌దాతో క‌లిసి 'ట‌క్క‌రి' అనే మ‌రో చిత్రం చేశాడు. అలాగే 'సై' చిత్రంతో త‌న‌కు హిట్ పెయిర్‌గా నిలిచిన జెనీలియాతో 'రామ్' చేశాడు. ఇక 'ఇష్క్' తో అచ్చొచ్చిన నిత్యా మీన‌న్‌తో 'గుండె జారి గ‌ల్లంత‌య్యిందే' చేశాడు.

ఈ మూడుసార్లూ త‌న‌కు క‌లిసొచ్చిన హీరోయిన్ల‌తోనే రెండోసారి సినిమాలు చేసిన నితిన్‌.. నాలుగోసారి మాత్రం అందుకు భిన్నంగా, తొలి ప్ర‌య‌త్నంలో క‌లిసి రాని హీరోయిన్‌కి రెండో అవ‌కాశ‌మిచ్చాడు. ఇంత‌కీ ఆ హీరోయిన్ ఎవ‌రంటే.. 'లై' చిత్రంలో జోడీ క‌ట్టిన మేఘా ఆకాష్‌. ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, త్రివిక్ర‌మ్ సంయుక్తంగా నిర్మిస్తున్న‌ చిత్రంలో నితిన్‌, మేఘా రెండోసారి క‌లిసి న‌టిస్తున్నారు. మ‌రి ఈ సారైనా ఈ కాంబినేష‌న్ హిట్ కొడ‌తారా? లేదా? అన్న‌ది ఆస‌క్తిక‌రంగా మారింది.

Show Full Article
Print Article
Next Story
More Stories