భారీ వడగళ్ల వాన.. విమానం అత్యవసర ల్యాండింగ్..

Submitted by nanireddy on Fri, 07/27/2018 - 09:55
tianjin-airlines-aircraft-made-emergency-landing-central-china

భారీ వడగళ్ల వాన దాటికి ఓ విమానం అత్యవసర ల్యాండ్‌ అయింది.  చైనా టియాన్‌జిన్‌ ఎయిర్‌లైన్స్‌కు చెందిన ఏ320 విమానం టియాన్‌జిన్‌ నుంచి హైనాన్‌కు బయలుదేరింది. ఇంతలో విమానం గాల్లో ఎగురుతుండగానే బరి వడగాళ్ల వాన కురిసింది. దీంతో విమానం ప్రమాదంలో చిక్కుకుందని ఫైలెట్లు అత్యవసర ల్యాండింగ్ కు ఉపక్రమించారు. అయితే అపప్టికే విమానం ముందు భాగం, అద్దాలు పగిలిపోయాయి. కాగా విమానంలోని ఇద్దరు పైలట్లు చాకచక్యంగా వ్యవహరించి, సమీపంలోని  వుహాన్‌ విమానాశ్రయంలో అత్యవసరంగా కిందకు దించడంతో  పెనుప్రమాదం తప్పింది. విమానంలోని ప్రయాణికులు సురక్షితంగా ఉన్నట్టు అధికారులు తెలిపారు.

English Title
tianjin-airlines-aircraft-made-emergency-landing-central-china

MORE FROM AUTHOR

RELATED ARTICLES