మొబైల్ ఫ్లాష్ తో చూపును కోల్పోయిన చిన్నారి

Submitted by lakshman on Tue, 02/06/2018 - 03:20
 Three-Month-Old Baby


ఈ న్యూస్ కు సంబంధించి వ్య‌క్తులు, ప్ర‌దేశాలు గురించి పూర్తి వివ‌రాలు ఎక్క‌డా వెల్ల‌డించ‌లేదు. ఓ దేశంలో ఫోటోలు తీయ‌డం వ‌ల్ల చిన్నారి పాప కంటిని కోల్పోయింది. ఈ రోజుల్లో సెల్ఫీల‌కు, ఫోటోల‌కు ఎంత క్రేజ్ ఉందో మ‌న‌కు తెలియంది కాదు. మ‌నం ఎక్క‌డ‌న్నా దిగినా, ఏదైనా ప‌నిచేసేట‌ప్ప‌డు ఫోటోల్ని దిగినా వాటిని సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేసి లైకులు, షేర్ల కోసం ఎదురు చూసే బాప‌తి మ‌నది. అలాంటి కోవ‌కు చెందిన ఓ వ్య‌క్తి త‌న క‌జిన్  మూడేళ్ల పాప‌ను ఫోటోలు, సెల్ఫీలు అని నానా హాడావిడి చేశాడు. అంతా అయితే ఎవ‌రి ప‌నిలో వారు ఉన్నారు. ఫోటోలు తీసిన మూడుగంట‌ల త‌రువాత చిన్నారి కన్ను ఎర్ర‌గా, మూసుకున్న‌ట్లు త‌ల్లిదండ్రులు కు అనుమానం వ‌చ్చింది. దీంతో చిన్నారిని ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. వైద్య ప‌రిక్ష‌లు చేపట్టిన డాక్ట‌ర్లు విస్తుపోయే వాస్త‌వాన్ని చెప్ప‌డంతో త‌ల్లిదండ్రులు గుండెలు బాధుకున్నారు. ఎందుకంటే చిన్నారి కంటి చూపును  కోల్పోయిందన్న బాధ‌ను జీర్ణించుకోలేక . ఫోటోలు తీయ‌డం వ‌ల్ల, ఫోటోల‌నుంచి వ‌చ్చిన ఫ్లాష్ వ‌ల్ల‌ కంటిలో ముక్లా అనే క‌ణాలు దెబ్బాతిన్నాయ‌నే, అందువ‌ల్లే చిన్నారి కంటిని కోల్పోయింద‌ని తెలిపారు. ఆప‌రేష‌న్ వ‌ల్ల చిన్నారి చూపు వ‌చ్చే అవ‌కాశం ఉంద‌ని భావించిన త‌ల్లిదండ్రులు ఆపరేష‌న్ చేయించేందుకు సిద్ధ‌ప‌డ్డారు. కానీ మాన‌వ శ‌రీరంలో అత్యంత మృదువైన చిన్నారి కంటికి ఆప‌రేష‌న్ చేయ‌డం సాధ్యం కాద‌ని తెగేసి చెప్పారు. ఈ ఘ‌నకార్యం చేసిన ఆ నిందితుడి చిన్నారి త‌ల్లిదండ్రులు కేసు పెట్టారు. కేసు విచార‌ణ కొన‌సాగుతుంది. అందుకే చిన్న‌పిల్ల‌ల్ని ఫోటోలు తీయ‌నీయ‌కండి. అలా చేయ‌డం వ‌ల్ల ఎలాంటి ప్ర‌మాదం సంభ‌విస్తుందో చూశారుగా బీ కేర్ ఫుల్ .   

English Title
Three-Month-Old Baby Left Blind In One Eye After Family Friend Forgot To Turn Off Camera Flash While Taking A Close Up

MORE FROM AUTHOR

RELATED ARTICLES