ఓ మంచి దొంగ ఉదంతం..

Submitted by chandram on Fri, 11/30/2018 - 19:13
Thief

దొంగతనం చెయ్యటమే తప్పు అలాంటిది దొంగల్లో కూడా మంచి దొంగలు ఉంటారని గి దొంగను సూస్తే అర్థంమౌతుంది. ఓ మంచి దొంగ ఉదంతం సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది.  ఇంగ్లండ్‌లోని బర్మింగ్‌హామ్‌లో ఓ స్టూడెంట్ నుంచి ల్యాప్‌టాప్ ఎత్తుకెళ్లాడో దొంగ. అయ్యోం పాపం ల్యాప్ టాప్ అయితే ఎత్తుకొచ్చిన కాని ల్యాప్ టాప్ ఓనర్ ఫిల్ అయితడేమో అనుకున్నడేమో, లేక మూలకు కుసోని బాధపడుతూ రాత్రిపూట బువ్వ తింటడో లేదో అనుకున్నాడేమో అసలు తాను ల్యాప్ టాప్ దొంగిలించడానికి గల కారణం తెలుపుతూ ఈ మెయిల్ పంపాడు. ఈ దొంగ ఉత్తరం గిప్పుడు సోసల్ మీడియాల్లో  వీర విహారం చేస్తుంది. 

అయితే ఉత్తరంలో ఎందుకు దొంగతనం చేశానో ముద్దుగా వివరిస్తూ  హాల్లో నీ ల్యాప్‌టాప్ దొంగిలించినందుకు క్షమించాలని నేను చాలా పేదోడిని. నాకు డబ్బులు చాలా అవసరమై నీ ల్యాప్‌టాప్‌ను దొంగిలించాను. కానీ నీ మొబైల్ ఫోన్, వ్యాలెట్ మాత్రం అక్కడే వదిలేసానని నా బాధ అర్దం చేసుకుంటావ్ అని కోరుతూ సదరు విద్యార్థికి మెయిల్‌ చేశాడు యూనివర్సిటీ వర్క్‌కు సంబంధించిన ఫైల్స్ ఏమైనా ఈ ల్యాప్‌టాప్‌లో ఉంటే చెప్పు మెయిల్ పంపిస్తామరోసారి సారీ’ అంటూ మెయిల్ పంపించాడు ఆ మంచి దొంగ
 

English Title
Thief Steals Laptop And Writes Apologetic Email To Owner

MORE FROM AUTHOR

RELATED ARTICLES