పెరిగిన పోలింగ్‌.. ఎవరికి కలిసొచ్చేనో..

పెరిగిన పోలింగ్‌.. ఎవరికి కలిసొచ్చేనో..
x
Highlights

2014 ఎన్నికల కంటే 2018 ఎన్నికల్లో పోలింగ్ శాతం పెరిగింది. అయితే పోలింగ్ పర్సెంటెజ్ పెరగడం పట్ల రాజకీయ పార్టీల విశ్లేషణలు ఎలా ఉన్నఇది ఓ మంచి పరిణామం...

2014 ఎన్నికల కంటే 2018 ఎన్నికల్లో పోలింగ్ శాతం పెరిగింది. అయితే పోలింగ్ పర్సెంటెజ్ పెరగడం పట్ల రాజకీయ పార్టీల విశ్లేషణలు ఎలా ఉన్నఇది ఓ మంచి పరిణామం అని అంటోంది ఎన్నికల కమిషన్. తాము మున్నెళ్ళ నుంచి చేసిన కృషికి ఇది మంచి ఫలితమని చెప్పారు. గతంలో ఎప్పుడూ లేని విధంగా రికార్డుస్థాయిలో 73.20 శాతం పోలింగ్‌ నమోదైంది. అయితే ఇది ఎక్కువగా గ్రామీణ ప్రాంతాలలోనూ పెరగడం ఇక్కడ చర్చినీయంశం. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో 73.20 పోలింగ్‌ శాతం నమోదవగా, వందకు పైగా నియోజకవర్గాల్లో భారీ ఓటింగ్‌ రికార్డైంది. ఖమ్మం జిల్లా మధిరలో రికార్డుస్థాయిలో 91.9శాతం పోలింగ్‌ జరగ్గా, హైదరాబాద్‌ చార్మినార్‌లో అతి తక్కువగా కేవలం 40శాతమే పోలింగ్ నమోదైంది. గ్రామీణ ప్రాంతాల్లో పోలింగ్‌ పర్సంటేజ్‌ పెద్దఎత్తున పెరగగా, ఒక్క హైదరాబాద్‌‌లోనే 50 కంటే తక్కువ శాతం రికార్డైంది. చార్మినార్‌లో 40.18, యాకత్‌పురాలో 41.24, మలక్‌పేట్‌లో 42.74, నాంపల్లిలో 44.02, జూబ్లీహిల్స్‌లో 45.61, చాంద్రాయణగుట్టలో 46.11, కంటోన్మెంట్‌లో 49.05 శాతం పోలింగ్ నమోదైంది.

మరో వైపు తోంభై శాతం దాటిన నియోజకవర్గాలు మధిర 91.65, అలేరు- 91.33, మునుగోడు - 91.07,నర్సాపూర్ 90.53,భువనగిరి - 90.53,నర్సంపేట- 90.06 లు ఉన్నాయి.ఆదిలాబాద్‌, ఖమ్మం, వరంగల్‌లోని గిరిజన, ఏజెన్సీల్లోనూ పోలింగ్‌ పెరిగింది. ఆదివాసీలు, గిరిజనులు ఓటేసేందుకు ఆసక్తి చూపించారు. దీనిని బ‌ట్టి చూస్తే ఎక్కువ‌గా రిజ‌ర్వుడ్ స్ధానాల్లోనే ఈ పెరుగుద‌ల ఎక్కువ‌గా ఉన్న‌ట్లు తెలుస్తుంది. ఇక ఇది ఇలా ఉటే 2014 ఎన్నికలతో పోల్చితే ఈసారి 103 నియోజకవర్గాల్లో పోలింగ్‌శాతం పెరిగింది. ఏడు నియోజకవర్గాలు ఏకంగా 90 స్కోరు దాటించాయి. 62 నియోజకవర్గాల్లో పోలింగ్‌ 80-90 శాతం నమోదైంది. రాష్ట్రంలో అత్యధిక పోలింగ్‌ పెరుగుదల ఈసారి ఆదిలాబాద్‌ నియోజకవర్గంలో నమోదైంది. క్రితంసారి శాతం 63.88 కాగా, ఈసారి 81.68 శాతంతో అగ్రస్థానంలో నిలిచింది. చార్మినార్‌ పోలింగ్‌ శాతం గణనీయంగా పడిపోయింది. అక్కడ రాష్ట్రంలోనే అత్యధికంగా 16 శాతం తగ్గింది. హైదరాబాద్‌, రంగారెడ్డి శివారు మినహా మిగతా జిల్లాల్లోని నియోజకవర్గాల్లో ఎక్కడా పోలింగ్‌ శాతం తగ్గకపోవడం కాస్తా అశ్చ‌ర్యానికి గురి చేస్తుంది.


ఆ యా నియోజ‌క‌వ‌ర్గాల్లో ఓటింగ్ న‌మోదు వివ‌రాలు ఇలా ఉన్నాయి. రాష్ట్రంలోనే అత్యధిక పోలింగ్ ప‌మోదు అయిన మధిరలో గ‌తంతో పోలిస్తే 2.15 శాతం పెరిగి, 91.65 గా లెక్కతేలింది. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా 3.36 శాతం పోలింగ్‌ పెరిగింది. పది నియోజకవర్గాల్లోనూ పోలింగ్‌ పెరిగింది. పాలేరు, వైరాల్లో పెరుగుదల స్వల్పంగా ఉండగా కొత్తగూడెం, ఖమ్మం, సత్తుపల్లి, భద్రాచలం, పినపాక, ఇల్లెందులో అధికంగా ఉంది. అత్యధిక పెరుగుదల- ఆదిలాబాద్‌ (17.76శాతం) అత్యధిక తగ్గుదల- చార్మినార్‌ (16 శాతం) పెరుగుదల10 శాతానికిపైగా తగుదల ఆదిలాబాద్‌, దేవరకద్ర, కొడంగల్‌, వనపర్తి, మక్తల్‌, కరీంనగర్‌, నల్గొండ, జహీరాబాద్‌, అచ్చంపేట. 5 శాతానికిపైగా నాంపల్లి, బహదూర్‌పురా, చాంద్రాయణగుట్ట, కంటోన్మెంట్‌, యాఖుత్‌పురా, చార్మినార్‌ పోలింగ్‌ శాతం పెరిగినవి 103 నియోజకవర్గాలు పోలింగ్‌ శాతం తగ్గినవి 16 నియోజకవర్గాలు 90 శాతానికిపైగా పోలింగ్ అయిన‌వి ఉన్నాయి. అయితే గ్రామీణ ప్రాంతాల్లో ఈ పెరుగుద‌ల కేవ‌లం సంక్షేమ ప‌థ‌కాల‌తో ల‌బ్ది పొందిన వారి త‌మ కృత‌జ్ణ‌త‌ను చాటుకోవ‌డం తోటే ఈ ప‌రిణామాలు చోటు చేసుకున్నాయ‌ని విశ్లేష‌కులు చెబుతున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories