దీనికంటే అదృష్టం మ‌రొకటి ఉంటుందా ?

Submitted by lakshman on Sun, 03/11/2018 - 12:58
anushka shetty

అనుష్క తెలుగు సినిమాల్లో త‌న‌కంటూ ఒక ప్ర‌త్యేకను సంపాదించుకున్న హీరోయిన్. ఇక ఇంత‌కంటే మంచిది మ‌రొక‌టి ఉంటుందా అంటోంది అనుష్క‌. నటనపై ఆధారపడి, సినిమాల్లో సంపాదించుకుంటూ సినిమా శాశ్వతం కాదని విమ‌ర్శిస్తూ.. వేరే వ్యాపారం చేసుకోవాలి అంటూ ఈ రంగాన్నే ఎంచుకోవాల‌నుకునేవారు కొంద‌రైతే..  సినిమానే ఆస్తులు, అంతస్తులు, ఆనందం అన్నీ ఇచ్చింది అని మర్యాదనిచ్చే వారు మరి కొందరు ఉన్నారు. 

నటిగా 13 ఏళ్ల అనుభవం. అంచెలంచెలుగా ఎదిగి అగ్ర హీరోయిన్‌గా రాణిస్తున్న అనుష్క చిత్రం అంటే కాసుల వర్షమే అనే పేరును సంపాందించుకున్నారు. అందం, అభినయం కలబోసిన అద్భుత నటి అనుష్క. తాజాగా భాగమతి సినిమాలో తన నట విశ్వరూపాన్ని చూపించారు. అందరూ స్వీటీ అని ప్రేమగా పిలుచుకునే ఈ బ్యూటీ తన సినీ అనుభవాన్ని ఒక భేటీలో పంచుకున్నారు. 

సినిమాల్లో నటించడం కూడా ఉద్యోగం లాంటిదే అన్నారు. ప్రభుత్వ, ప్రైవేట్‌ రంగాల్లో మాదిరిగానే సినిమాల్లో మేము పనిచేస్తున్నాం. అయితే ఇతరుల కంటే మాదే అత్యుత్తమ పని. ఎందుకంటే సినిమాలను ఇష్టపడని వారు ఉండరు. ప్రపంచ వ్యాప్తంగా ప్రేమించే సినిమారంగంలో ఒక నటిగా నేనుండడం ఘనతగా భావిస్తున్నానని చెప్పారు అనుష్క‌.  ఒక్క పారితోషికం మాత్రమే కాకుండా ఇక్కడ చాలా సౌకర్యాలను అనుభవిస్తున్నాన‌ని చెప్పారు. ఇక కష్టనష్టాలనేవి అన్ని రంగాల్లోనూ ఉంటాయని చెప్పింది.

 అయితే సినిమారంగంలో శ్రమించి ఉన్నత స్థాయికి చేరుకుంటే హీరోయిన్లను రాణులుగా చూస్తారు. ఇతర రంగాల్లో ఉద్యోగం చేసేవారు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకే పని చేసి అలసిపోతారు. తాము మాత్రం 24 గంటలు స్టూడియోల్లో మగ్గి పని చేసినా అలుపు ఉండదన్నారు. అలాంటి ఇష్టమైన వృత్తి సినిమా రంగం. ఇంతకంటే ఉత్తమమైన పని వేరేమీ ఉండదని స్ప‌ష్టం చేశారామె. 

English Title
is there any good for luck ?

MORE FROM AUTHOR

RELATED ARTICLES