తకిట తదిమి తకిట తదిమి తందాన !

తకిట తదిమి తకిట తదిమి తందాన !
x
Highlights

కొన్ని పాటలు... ఆడియన్స్ మదిలో ఎప్పటికి నిలిచి పోతాయి...అలా నిలిచిపోయే పాటనే... ఈ తకిట తదిమి తకిట తదిమి తందాన అనే ఈ పాట... తకిట తదిమి తకిట తదిమి తందాన...

కొన్ని పాటలు... ఆడియన్స్ మదిలో ఎప్పటికి నిలిచి పోతాయి...అలా నిలిచిపోయే పాటనే... ఈ తకిట తదిమి తకిట తదిమి తందాన అనే ఈ పాట... తకిట తదిమి తకిట తదిమి తందాన అనే ఈ పాట 1983లో విడుదలైన సాగర సంగమం చిత్రంలోని సుప్రసిద్ధమైన పాట. ఈ పాట రచయిత వేటూరి సుందరరామ్మూర్తి కలం నుండి జాలువారింది. దీనిని ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం గానం చేయగా ఇళయరాజా స్వరపరచారు. దీనిలో కమలహాసన్ అద్భుతంగా తన నృత్యంతో అలరించారు. దీనికి దర్శకత్వం కె. విశ్వనాథ్.

తకిట తదిమి తకిట తదిమి తందాన

హృదయలయల జతుల గతుల తిల్లాన ||తకిట||

తడబడు అడుగుల తప్పని తాళాన

తడిసిన పెదవుల రేగిన రాగాన || తడబడు||

శృతిని లయని ఒకటి చేసి

తకిట తదిమి తకిట తదిమి తందాన

హృదయలయల జతుల గతుల తిల్లాన||తకిట||


పాటలో మధ్యలో జయప్రద నుదుటి మీద కుంకుమబొట్టు వర్షానికి తడిసికారిపోతుండగా చూసిన కమలహాసన్,అది కరగకుండా తన చేయి అడ్డు పెడతాడు. తద్వారా జయప్రద వైవాహిక జీవితానికి ఎటువంటి సమస్యలు రాకూడదని కమలహాసన్ మనోవేదనను తెలియజేస్తుంది. ఆ సన్నివేశం... ప్రేక్షకుల మనసులను కదిలిస్తుంది. శ్రీ.కో.

Show Full Article
Print Article
Next Story
More Stories