శరీరం రెండుగా చీలాక కూడా పగ తీర్చుకున్న పాము

Submitted by nanireddy on Thu, 06/07/2018 - 20:52
texas-man-nearly-dies-after-being-bitten-by-severed-rat

పూర్వికులు చెప్పినట్టు పాములు పగబడతాయో లేదో కానీ ర్యాటిల్ స్నేక్ ఓ వ్యక్తిపై కసి తీర్చుకుంది. అదికూడా శరీరభాగం రెండు ముక్కలయ్యాక వ్యక్తిపై కాటేసింది. వివరాల్లోకి వెళితే టెక్సాస్ కు చెందిన మీలో, జెన్నీఫర్‌లు భార్యాభర్తలు. మూడురోజుల కిందట ఇంటికిదగ్గరలోని పెరట్లో పని చేస్తున్నారు. అయితే సడన్ గా అక్కడికి ఓ ర్యాటిల్ స్నేక్ వచ్చింది. దాన్ని చూసి జెన్నీఫర్‌ మొదట ఖంగారు పడి. తరువాత తనవద్దనున్న కత్తితో పాముని రెండు ముక్కలు చేసింది.  కానీ పాము శరీర భాగాలు రెండుగా చీలాక కూడా  బుసలు కొడుతూ ఎగిరి పడుతోందని  గ్రహించి భయంతో కేకలు వేసింది జెన్నీఫర్‌  .ఇంతలో ఆమె భర్త మీలో వచ్చి దాన్ని పడేయడానికి  తల భాగాన్ని పట్టుకున్నాడు. కొన ఊపిరితో ఉన్న రాటిల్‌ స్నేక్‌ అమాంతం అతని చేతిపై కాటు వేసింది. ఇంకేముంది ఒక్కసారిగా అస్వస్థతకు లోనయ్యాడు. వెంటనే అతన్ని ఆసుపత్రికి తీసుకెళ్లింది జెన్నీఫర్‌. అయితే ప్రాణాపాయం ఏమి లేకపోయినా అతను రెండు రోజుల నుంచి వివిధ రకాల ఇంజెక్షన్లతో చికిత్స తీసుకుంటున్నాడని.. ఇప్పటికే అతని కిడ్నీలు సరిగా పనిచేయడం లేదని వైద్యులు చెబుతున్నారు. 

English Title
texas-man-nearly-dies-after-being-bitten-by-severed-rat

MORE FROM AUTHOR

RELATED ARTICLES