అందుకు టీడీపీ సిద్దమే ..టెన్షన్ లో వైసీపీ!

అందుకు టీడీపీ సిద్దమే ..టెన్షన్ లో వైసీపీ!
x
Highlights

ఆంధ్రప్రదేశ్ లో ఇటీవలకాలంలో రాజకీయాలు రసవత్తరంగా మారాయి.. అదికార, ప్రతిపక్షాలు నువ్వా నేనా అన్నట్టు మాటల తూటాలు పేల్చుతున్నాయి.. ఆంధ్రప్రదేశ్ కు...

ఆంధ్రప్రదేశ్ లో ఇటీవలకాలంలో రాజకీయాలు రసవత్తరంగా మారాయి.. అదికార, ప్రతిపక్షాలు నువ్వా నేనా అన్నట్టు మాటల తూటాలు పేల్చుతున్నాయి.. ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేకహోదా ఇవ్వనందుకు నిరసనగా వైసీపీ ఎంపీలు తమ పదవులకు రాజీనామాలు చేసిన సంగతి తెలిసిందే. అయితే స్పీకర్ ఇంకా వాటిని ఆమోదించలేదు. ఈ నిర్ణయం బావోద్వేగంలో తీసుకున్నదని.. రాజీనామాలపై పునరాలోచించుకోవాలని సదరు ఎంపీలకు సూచించారు స్పీకర్. దీనిపై వారికి వారంరోజులపాటు గడువు కూడా ఇచ్చారు. అయితే నేటితో అది ముగుస్తోంది. ఈ నేపథ్యంలో లోక్ సభ స్పీకర్ ను వైసీపీ ఎంపీలు కలిసే అవకాశముంది. తమ రాజీనామాలు ఎలాగైనా ఆమోదింపజేసుకుంటామని వైసీపీ ఎంపీలు వెల్లడిస్తున్నారు.దీనిపై ఆ పార్టీ నేతల్లో టెన్షన్ న నెలకొంది. మరోవైపు టీడీపీకూడా ఈ విషయంలో దూకుడు పెంచింది. చేతనైతే రాజీనామాలు ఆమోదింపజేసుకోవాలని. స్పీకర్ వాటిని ఆమోదిస్తే ఎన్నికలకు వెళ్ళడానికి తాము సిద్ధమేనని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రకటిచారు.అయితే ఈ విషయంలో సీఎం చంద్రబాబు బీజేపీ నేతలతో కుమ్మక్కై రాజీనామాలు ఆమోదించకుండా అడ్డుపడే కుట్ర చేస్తున్నారని వైసీపీ ఆరోపిస్తోంది. ఫైనల్ గా ఏమి జరుగుతుందోనని రెండు పార్టీలనేతలు ఆతృతగా ఎదురు చూస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories