కదులుతున్న జీపులోకి దూకిన చిరుత

Submitted by arun on Sat, 03/31/2018 - 12:04

ఉన్నట్టుండి చిరుత ఎదురైతే...ఎవరికైనా గుండెలు జారిపోతాయ్. అదే మీరు వెళ్తున్న వాహనంలోకి చిరుత చొరబడితే ప్రాణం పోయినంత పనవుతుంది. అలాంటి ఘటనే టాంజానియాలోని సెరంగిటి నేషనల్ పార్క్‌లో జరిగింది. బ్రిటన్ హేస్‌ సఫారీ జీపులో వెళ్తుండగా వాహనం వెనుక నుంచి సీటులోకి దూకింది. చిరుత వాహనంలోకి రావడంతో...బ్రిటన్‌ హేస్‌ కదలకుండా విగ్రహం అలాగే ఉండిపోయాడు. గతంలో గైడ్‌ చెప్పిన సూచనల ప్రకారం ఊపిరి బిగబట్టి కూర్చున్నాడు. దీంతో చిరుత వచ్చిన దారిలోనే వెళ్లిపోయింది. 

English Title
Tense moment a cheetah jumps in next to a tourist INSIDE a safari jeep

MORE FROM AUTHOR

RELATED ARTICLES