మాస్టర్ సచిన్ 10 జెర్సీ తాత్కాలిక రిటైర్మెంట్

Highlights

భారత క్రికెట్ దేవుడు మాస్టర్ సచిన్ టెండుల్కర్ ధరించిన బ్లూకలర్ నంబర్ 10 జెర్సీని అనధికారికంగా రిటైర్ చేయాలని బీసీసీఐ నిర్ణయించింది. 2012లో మాస్టర్...

భారత క్రికెట్ దేవుడు మాస్టర్ సచిన్ టెండుల్కర్ ధరించిన బ్లూకలర్ నంబర్ 10 జెర్సీని అనధికారికంగా రిటైర్ చేయాలని బీసీసీఐ నిర్ణయించింది. 2012లో మాస్టర్ సచిన్ వన్డే రిటైర్మెంట్ తర్వాత ముంబై యువఫాస్ట్ బౌలర్ శార్దూల్ ఠాకూర్ కు బీసీసీఐ కేటాయించడం తీవ్రవిమర్శలకు దారితీసింది. సోషల్ మీడియాలో సచిన్ అభిమానులు గగ్గోలు పెట్టడంతో బీసీసీఐ ఇక నంబర్ 10 జెర్సీని రిటైర్ చేయాలని నిర్ణయించింది. ప్రస్తుత టీమిండియాలోని ఏ ఆటగాడు 10 జెర్సీని ధరించడానికి ఆసక్తి చూపడం లేదని పైగా ఈ జెర్సీని అధికారికంగా రిటైర్ చేయాలంటే ఐసీసీ అనుమతి తప్పనిసరని క్రికెట్ పండితులు చెబుతున్నారు. మాస్టర్ సచిన్ 10 జెర్సీ ధరించే 463 వన్డేల్లో 49 సెంచరీలు సాధించి చరిత్ర సృష్టించాడు. సచిన్ పట్ల గౌరవసూచకంగానే 10 జెర్సీని తాత్కాలికంగా రిటైర్ చేయాలని బీసీసీఐ నిర్ణయించింది.

Show Full Article
Print Article
Next Story
More Stories