విశాఖ మన్యంలో పడిపోతున్న ఉష్ణోగ్రతలు

విశాఖ మన్యంలో పడిపోతున్న ఉష్ణోగ్రతలు
x
Highlights

విశాఖ జిల్లాలోని మన్యం ప్రాంతంలో ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. చింతపల్లిలో ఇవాళ ఉదయం 6 డిగ్రీల కనీస ఉష్ణోగ్రత నమోదైంది. ప్రతి ఏడాది డిసెంబర్ మొదటి, రెండో...

విశాఖ జిల్లాలోని మన్యం ప్రాంతంలో ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. చింతపల్లిలో ఇవాళ ఉదయం 6 డిగ్రీల కనీస ఉష్ణోగ్రత నమోదైంది. ప్రతి ఏడాది డిసెంబర్ మొదటి, రెండో వారాల్లో చలి తీవ్రత పెరుగుతూ ఉంటుంది. అయితే... ఈ ఏడాది మాత్రం నవంబర్ చివర్లోనే చలిపులి చంపేస్తోంది. దీంతో ముఖ్యమంగా చిన్నపిల్లలు, వృద్ధులు చలికి వణికిపోతున్నారు. ఉదయం మంచు దట్టంగా రహదారులు సైతం కనిపించనంతగా అలుముకుంది. లంబసింగిలో 4 డిగ్రీలు, అరకులో 10 డిగ్రీలు, పాడేరులో 8 డిగ్రీలు, పాడేరు ఘాట్ రోడ్డులో 6 డిగ్రీలు చొప్పున ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories