తెలుగువీర లేవరా

తెలుగువీర లేవరా
x
Highlights

దేశభక్తి గీతాలలో... కొన్ని గీతాలు అద్బుతమైన ప్రముక్యతని సంపాదించుకుంటాయి. అలాంటి పాటే..తెలుగువీర లేవరా. ఈ సినిమా.. 1974లో విడుదలైన అల్లూరి సీతారామరాజు...

దేశభక్తి గీతాలలో... కొన్ని గీతాలు అద్బుతమైన ప్రముక్యతని సంపాదించుకుంటాయి. అలాంటి పాటే..తెలుగువీర లేవరా. ఈ సినిమా.. 1974లో విడుదలైన అల్లూరి సీతారామరాజు సినిమాలోని దేశభక్తి గీతం. దీనిని ప్రముఖ రచయిత శ్రీరంగం శ్రీనివాసరావు రచించారు. భారత స్వాతంత్ర్య సమరస్పూర్తితో ఘంటసాల వెంకటేశ్వరరావు, వి.రామకృష్ణ బృందం ఈ గీతాన్ని చక్కగా ఆలపించారు. దర్శకుడు రామచంద్రరావు ఘట్టమనేని కృష్ణ మరియు ఇతర నటులపై చిత్రీకరించారు.
తెలుగువీర లేవరా దీక్షబూని సాగరా

దేశమాత స్వేచ్ఛకోరి తిరుగుబాటు చేయరా ||| తెలుగువీర లేవరా |||

దారుణ మారణకాండకు తల్లడిల్లవద్దురా ||| దారుణ |||
నీతిలేని శాసనాలు నేటినుంచి రద్దురా ||| నీతిలేని |||

నిదురవద్దు బెదరవద్దు నింగి నీకు హద్దురా ||| నింగి నీకు ||| ||| తెలుగువీర లేవరా |||
ఎవడువాడు ఎచటివాడు ఇటువచ్చిన తెల్లవాడు ||| ఎవడువాడు |||

కండబలం, కొండఫలం కబళించే దుండగీడు
మానధనం, ప్రాణధనం దోచుకునే దొంగవాడు ||| ఎవడువాడు |||

తగినశాస్తి చేయరా తరిమి తరిమి కొట్టరా ||| తగినశాస్తి ||| ||| తెలుగువీర లేవరా |||
ఈ దేశం ఈ రాజ్యం నాదే అని చాటించి ||| ఈ దేశం |||

ప్రతి మనిషీ తొడలుగొట్టి, శృంఖలాలు పగులగొట్టి

చురకత్తులు పదునుబట్టి, తుదిసమరం మొదలుపెట్టి
సింహాలై గర్జించాలి సంహారం సాగించాలి వందేమాతరం ||| తెలుగువీర లేవరా |||
శ్రీ.కో.

Show Full Article
Print Article
Next Story
More Stories