తెలుగు రాష్ట్రాల్లో రైతులకు దెబ్బమీద దెబ్బ

తెలుగు రాష్ట్రాల్లో రైతులకు దెబ్బమీద దెబ్బ
x
Highlights

కాలంగాని కాలంలో.. మండే ఎండల్లో ఉరుములతో, పిడుగులతో వరుణుడు కల్లోలం సృష్టించాడు. తెలుగు రాష్ట్రాల్లోని పలు జిల్లాలను ఊపిరి పీల్చుకోకుండా చేశాడు....

కాలంగాని కాలంలో.. మండే ఎండల్లో ఉరుములతో, పిడుగులతో వరుణుడు కల్లోలం సృష్టించాడు. తెలుగు రాష్ట్రాల్లోని పలు జిల్లాలను ఊపిరి పీల్చుకోకుండా చేశాడు. రైతులను దెబ్బ మీద దెబ్బ తీస్తున్నాడు. అకాలంలో వచ్చిన ఈదురుగాలతో కూడిన వర్షాలకు పంటలు నాశనమయ్యాయి. తెలుగు రాష్ట్రాల్లో వేల క్వింటాళ్ల ధాన్యం నీటిపాలైంది. ఉమ్మడి వరంగల్‌ జిల్లా పెద్దవంగర, వర్దన్నపేట, ఐనవోలు, ములుగు, జనగాంలలో పంటలకు తీవ్ర నష్టం వాటిళ్లింది. ఉమ్మడి ఖమ్మం జిల్లా కల్లూరు, ఏన్కూరు, కూసుమంచి, ఇల్లందు, గుండాల మండలాల్లో పొలాల్లోనే ఉన్న పంట గాలివాటానికి కొట్టుకుపోయింది.

ప్రకృతి ప్రకోపానికి ఆంధ్రప్రదేశ్‌ అల్లకల్లోలమైంది. కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లో గాలిదుమారం పెను బీభత్సాన్నే సృష్టించింది. రెండు రోజులు కిందట కురిసిన భారీవర్షం, పిడుగుల నుంచి ప్రజలు తేరుకోకముందే మళ్లీ విరుచుపడటంతో రైతులు తీవ్ర నష్టాలపాలయ్యారు. మామిడి, అరటి, బొప్పాయి పంటలకు దెబ్బమీద దెబ్బ తగిలింది.

ఖమ్మం మార్కెట్‌లో మార్క్‌ఫెడ్‌ కొనుగోలు చేసిన మొక్కజొన్న నిల్వలపై టార్పాలిన్‌ వేసినా కిందిభాగంలోకి నీరు చేరింది. కరీంనగర్‌ మార్కెట్‌యార్డులో టార్పాలిన్ల కొరతతో ధాన్యం తడిసిపోయింది. రెండురోజుల పాటు కొనుగోళ్లు నిలిపివేస్తున్నామని, రైతులు ధాన్యం తీసుకురావద్దంటూ జిల్లా అధికారులు ప్రకటించారు. నల్గొండ జిల్లా తుంగతుర్తి, తిరుమలగిరి, సూర్యాపేట, నకిరేకల్‌లలో కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం నిల్వలు నీటిపాలయ్యాయి. మహబూబ్‌నగర్‌ జిల్లా నారాయణపేట, బాలానగర్‌, నవాబ్‌పేట, దేవర్‌కద్రలోనూ వర్షం భారీగా కురిసింది. బస్తాల కొద్ది ధాన్యం తడిసిపోయింది. కల్వకుర్తి మార్కెట్‌కు వచ్చిన ధాన్యం తడిసింది. సిద్దిపేట జిల్లా తొగుట, హుస్నాబాద్‌లో కొనుగోలు కేంద్రాల్లో మొక్కజొన్న, వరి పంట తడిసిపోయింది.

Show Full Article
Print Article
Next Story
More Stories