విమాన ప్ర‌యాణంలో ఇంట‌ర్నెట్ సేవ‌లు

Submitted by lakshman on Sat, 01/20/2018 - 11:17
Telecom Regulatory Authority of India,

మ‌న‌దేశంలోని విమాన ప్ర‌యాణంలో కొన్ని నిబంధ‌న‌లు మార‌నున్నాయి. త‌రుచుగా విమానంలో ప్ర‌యాణం చేసే వారు. త‌మ ఫోన్ల‌ని ఫ్లైట్ మోడ్ లో పెట్ట‌డం,మొబైల్‌ కనెక్టివిటీ, ఇంట‌ర్నెట్ వినియోగాన్ని నిషేధిస్తారు. కానీ ఇప్పుడు ఆ నిబంధ‌న‌ల్ని ట్రాయ్ స‌వ‌రించింది. ( టెలికాం రెగ్యూలారిటీ ఆఫ్ ఇండియా)
సాధార‌ణంగా ఇంట‌ర్నెట్ సేవ‌ల్ని విమాన ప్రయాణంలో వినియోగించ‌ర‌న్న విష‌యం తెలిసిందే. దానికి కార‌ణం విమాన ప్ర‌యాణంలో మొబైల్ ను ప్లైట్ మోడ్ లో పెడ‌తారు. అయితే ప్ర‌యాణంలో మొబైల్ ను ఎందుకు ప్లైట్ మోడ్ లో పెడ‌తారో తెలుసుకుందాం. 
మ‌నం మారే ప్లేస్ ను బ‌ట్టి సెల్ ఫోన్ సిగ్న‌ల్స్ మారుతుంటాయి. అలా మ‌నం విమాన ప్ర‌యాణం చేస్తున్న‌ప్పుడు  గాలిలో 10వేల అడుగుల ఎత్తులో విమానంలో వెళ్తున్న‌ప్పుడు సెల్ ట‌వ‌ర్స్‌ను వేగంగా దాటుకుంటూ వెళ్ల‌డం జ‌రుగుతుంది. 
దీంతో పెద్ద ఎత్తున నెట్‌వ‌ర్క్ ప్రాబ్లం ఏర్ప‌డి భూమిపై ఉన్న‌వారికి నెట్‌వ‌ర్క్ సంబంధిత స‌మ‌స్య‌లు వ‌స్తాయి. అందుకోస‌మే విమానంలో వెళ్లేట‌ప్పుడు ఎయిర్ హోస్టెస్‌లు మ‌న ఫోన్ల‌ను ఫ్లైట్ మోడ్‌లో పెట్ట‌మ‌ని చెబుతారు
ఇప్పుడు తాజాగా ట్రాయ్ నిబంధ‌న‌ల ప్ర‌కారం  దేశీయ విమానయానంలో మొబైల్‌ కనెక్టివిటీ, ఇంటర్నెట్‌ సేవల్ని ఉప‌యోగించుకోవ‌చ్చు. ఫోన్లు ఫ్లయిట్ మోడ్‌లో ఉన్నప్పుడు వైఫై ద్వారా ఇంటర్నెట్ వాడుకోవచ్చు.
విమాన ప్ర‌యాణంలో 3 వేల మీటర్ల కంటే ఎక్కువ ఎత్తులో ఎగురుతున్నప్పుడే వాడుకోవాలి. ఆ సమయంలోనే టెరిస్ట్రియల్‌ నెట్‌వర్క్‌ను వాడుకోవాలని ట్రాయ్ సూచించింది. ట్రాయ్ నిబంధనల ప్రకారం విమానం టేకాఫ్, ల్యాండిగ్ సమయాల్లో మొబైల్ సేవల్ని ఉపయోగించుకోలేం.
ఈ సేవలను అందించడం విమానయాన సంస్థల ఇష్టమని ట్రాయ్ అధికారులు స్పష్టం చేశారు.

English Title
Telecom Regulator Recommends Internet, In-Flight Mobile Calls In India

MORE FROM AUTHOR

RELATED ARTICLES