వారంరోజులపాటు ఉచిత కాల్స్, డాటా సేవలను ప్రకటించిన టెలికాం సంస్థలు

వారంరోజులపాటు ఉచిత కాల్స్, డాటా సేవలను ప్రకటించిన టెలికాం సంస్థలు
x
Highlights

పదిరోజులుగా కేరళ రాష్ట్రంలో వరదలు బీభత్సం సృష్టిస్తున్న సంగతి తెలిసిందే. వరదల కారణంగా చోటుచేసుకున్న మరణాల సంఖ్య 167కు పెరిగిందని సీఎం పినరయి విజయన్‌...

పదిరోజులుగా కేరళ రాష్ట్రంలో వరదలు బీభత్సం సృష్టిస్తున్న సంగతి తెలిసిందే. వరదల కారణంగా చోటుచేసుకున్న మరణాల సంఖ్య 167కు పెరిగిందని సీఎం పినరయి విజయన్‌ శుక్రవారం వెల్లడించారు. కొన్ని ప్రాంతాల్లో వర్షాలు తగ్గుముఖం పట్టినా పరిస్థితి ఇంకా తీవ్రంగా ఉందని చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా పునరావస శిబిరాల్లో 2.23 లక్షల మంది ఆశ్రయం పొందుతున్నారని వెల్లడించారు. ఇదిలావుంటే వరదలతో అతలాకుతలం అయిన కేరళకు తమ వంతు సాయం అందిస్తున్నాయి వివిధ టెలికాం సంస్థలు. వారం రోజులపాటు ప్రీపెయిడ్‌ కస్టమర్లకు ఉచిత కాల్స్‌, డాటా సేవలను అందిస్తున్నట్టు రిలయెన్స్‌ జియో, బీఎస్‌ఎన్‌ఎల్‌లు ప్రకటించాయి. అలాగే పోస్ట్‌పె​యిడ్‌ కస్టమర్లు చెల్లించాల్సిన బిల్లులకు గడవు తేదీని పెంచినట్టు టెలికాం సంస్థలు తెలిపాయి. ఎయిర్‌ టెల్‌ తనవంతుగా 30 రూపాయల టాక్‌టైమ్‌.. వారం రోజులపాటు 1 జీబీ డాటా ప్రకటించింది. అంతేకాదు వరదలతో విద్యుత్ సరఫరా లేక ఇబ్బందిపడుతున్న ప్రాంతాలకు తమ ఎయిర్టెల్ స్టోర్లలో మొబైల్ ఛార్జింగ్ సదుపాయం ఏర్పాటు చేశామని ఎయిర్టెల్ తెలిపింది.

Show Full Article
Print Article
Next Story
More Stories