టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే ఇంటి నల్లా కనెక్షన్‌ కట్‌..!

టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే ఇంటి నల్లా కనెక్షన్‌ కట్‌..!
x
Highlights

గ్రేటర్ హైదరాబాద్ లో అక్రమ నల్లా కనెక్షన్ల బండారం బయటపడుతోంది. సమాజంలో పేరు ప్రఖ్యాతులున్న కొందరు బడా బాబులు జలమండలికి చిల్లి గవ్వ చెల్లించకుండా...

గ్రేటర్ హైదరాబాద్ లో అక్రమ నల్లా కనెక్షన్ల బండారం బయటపడుతోంది. సమాజంలో పేరు ప్రఖ్యాతులున్న కొందరు బడా బాబులు జలమండలికి చిల్లి గవ్వ చెల్లించకుండా దొడ్డిదారిన ఏళ్ల తరబడి మంచినీళ్లు తోడేస్తున్నారు. దొంగ చాటున కనెక్షన్లు తీసుకున్న వారిలో సినీ, వ్యాపార, రాజకీయ నాయకులున్నారు. వీరందరిపై జలమండలి కేసు నమోదు చేసింది.

గ్రేటర్ హైదరాబాద్ లో మంచినీళ్లు దొంగలు దొరికారు. ఏళ్ల తరబడి, జలమండలి నీళ్లు దోచేస్తున్నారు. కొందరు పెండింగ్ బకాయిలు చెల్లించకుంటే.. జలమండలి ట్యాప్ కనెక్షన్లు తొలగించింది. ఐతే, వారు మాత్రం పెండింగ్ బకాయిలు చెల్లించకుండా.. మళ్లీ, బిల్డింగ్ ఓనర్లు దొడ్డిదారిన వారికీ వారే అక్రమంగా నల్లా కనెక్షన్లు తీసుకున్నారు. దీంతో సిటీలో ఇలాంటి కేటు గాళ్లను గుర్తించే పనిలో పడింది జలమండలి.

గత వారం రోజులుగా జూబ్లీహిల్స్, బంజారా హిల్స్ ఏరియాల్లో జలమండలి అధికారులు తనిఖీలు చేస్తున్నారు. ఒక్కరోజే జూబ్లీహిల్స్ లో చేసిన డ్రైవ్ లో 10 మంది 17లక్షల పెండింగ్ బిల్స్ చెల్లించాల్సి వుందని తేలింది. ఐనా, వాళ్లు మాత్రం, మళ్లీ దొడ్డి దారిన నల్లా కనెక్షన్ తీసుకున్నారు. ఎక్కువగా ధనికులు వుండే ఏరియాలో.. నీటి దొంగలు ఏంటని అనుకున్నా.. తర్వాత మాత్రం కళ్లు తిరిగే షాక్ ఇచ్చారు. ఇప్పటికే జలమండలి విజిలెన్స్ టీం 86 మందిపై అక్రమ నల్లా కనెక్షన్లు తీసుకున్నందుకు స్థానిక పోలీస్ స్టేషన్ ల్లో క్రిమినల్ కేసులు నమోదు చేశారు. పైసా కట్టకుండా నీళ్లు దోచేస్తున్న వారిలో టీఆరెస్ ఎమ్మెల్యే బాబు మోహన్ , సినీ నటుడు మాదాల ర‌వి ఉన్నారు. టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే బాబు మోహన్‌ ఇంటి నల్లా కనెక్షన్‌ను వాటర్‌బోర్డు అధికారులు తొలగించారు. బాబుమోహన్‌ ఇంటిపై 4 లక్షల రూపాయల నల్లా బిల్లులు బకాయి ఉందని తెలిపారు. సినీ నటుడు మాదాల రవి ఇంటి నల్లా కనెక్షన్‌ కూడా కట్‌ చేశారు. రవి ఇంటిపై రూ. 3 లక్షల నల్లా బిల్లు బకాయి ఉందని వెల్లడించారు. వీరందరిపై జలమండలి ఐపీసీ సెక్షన్ 269, 430 కింద కేసు న‌మోదు చేశారు. జలమండలి న‌గ‌ర ప్రజ‌ల దాహార్తి తీర్చడానికి ప్రతి నెల వంద కోట్ల వరకు ఖర్సు చేసి నీటిని క్రుష్ణ‌, గోదావ‌రి న‌దుల నుండి తీసుకొస్తోంది. కానీ ఇలా కొందరు బడా బాబులు మాత్రం దర్జాగా నీటిని దొడ్డిదారిన దోడేస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories