చలికాలంలోనూ బీర్‌బలులదే హవా

Highlights

మండుటెండల్లో చల్లటి బీర్లు వర్షాకాలం, శీతాకాలంలో లిక్కర్‌ మద్యం సేవించేవారు ఫాలోఅయ్యే సాధారణ ఫార్ములా ఇది తెలుగు రాష్ర్టాలతో పాటు, దక్షిణాది...

మండుటెండల్లో చల్లటి బీర్లు వర్షాకాలం, శీతాకాలంలో లిక్కర్‌ మద్యం సేవించేవారు ఫాలోఅయ్యే సాధారణ ఫార్ములా ఇది తెలుగు రాష్ర్టాలతో పాటు, దక్షిణాది రాష్ర్టాలన్నిటిలోనూ దాదాపుగా ఇదే విధానం కనిపిస్తుంటుంది. కాని తెలంగాణ లో మాత్రం అందుకు భిన్నమైన పరిస్థితులు కనిపిస్తున్నాయి. మండుటెండల్లో బీర్లను తాగే మందుబాబులు ఇప్పుడు చలి కాలంలోను బీరు బాట పడుతున్నారు. వేసవి కాలం కంటే సేల్స్ ఎక్కువగా పెరిగిన చలికాలపు బీర్ల పై ఓ స్టోరీ.

రాష్ట్ర్రంలో చలి పులి పంజా విసురుతోంది. రోజు రోజు కు పెరిగిన చలి వల్ల వృద్దులు, చిన్న పిల్ల లతో పాటు మద్య వయస్కులు కూడా గజగజ వణుకుతున్నారు. కాని మందు బాబులు మాత్రం ఎముకలు కొరికే చలి లో కూడా కూల్ కూల్ బీర్లు తాగుతున్నారు. అదీ మండే ఎండాకాలంలో కంటే కూడా చాలా ఎక్కువగా తాగుతున్నారు. అదీ మన తెలంగాణ లో ఇంకా ఎక్కువగా బీర్లు లాగించేస్తున్నారు. ముఖ్యంగా బీర్లు తాగేవాళ్లలో 95% యువతేనని, అప్పుడప్పుడే మద్యం అలవాటు చేసుకునే వాళ్లు మొదట బీరు తాగుతున్నట్లు పరిశీలనల్లో తేలుతోంది. అదీ బీర్లు కాకుండా మిగతా హార్డ్ లో అల్కహాల్ శాతం ఎక్కువగా ఉంటుందని యువత వీటివైపే మొగ్గు చూపుతున్నారు.

ముఖ్యంగా తెలంగాణ లో అంచనాకు మించి బీర్ల విక్రయాలు జరుగుతున్నాయి. మన వాళ‌్లు ఎంతలా బీర్లు తాగుతున్నారు అంటే బీరు బాబుల తాకిడి పెరిగిపోయి పొరుగు రాష్ట్రాల నుంచి దిగుమతి చేసుకోవాల్సి వస్తోంది. బీర్ల విక్రయంలో దక్షిణాది రాష్ట్రాల్లో తెలంగాణే నంబర్‌ వన్‌గా నిలిచినట్లు తాజా నివేదికలు చెబుతున్నాయి. సగటున నెలకు 37.5 లక్షల కేసుల బీర్లను మందు బాబులు లాగిస్తున్నారు. అంచనాలకు మించి డిమాండ్‌ పెరగడంతో పక్క రాష్ట్ర్రాలకు బీర్ల ఎగుమతులు తాత్కాలికంగా నిలిపి వేసి వేరే రాష్ట్ర్రాల నుంచి రోజుకు 20 వేల కేసుల చొప్పున టీఎస్‌బీసీఎల్‌ దిగుమతి చేసుకుంటోంది. వాటి తో పాటు షాపు లలో కూడా గత వేసవి కాలం లో కంటే ఎక్కువగా గానే బీరు కేసుల ను తెప్పించుకుంటున్నామని చెబుతున్నారు యజమానులు.

తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం 6 బీరు ఉత్పత్తి పరిశ్రమలు ఉన్నాయి. వీటి ద్వారా నెలకు 507.91 లక్షల బల్కు లీటర్ల చొప్పున..అదే ఏడాదికి 6,096 బీఎల్‌ఎస్‌ల బీరు ఉత్పత్తి అవుతోంది. ఇందులో 5,500 బీఎల్‌ఎస్‌లు రాష్ట్రంలోనే వినియోగ మవుతుండగా.. మిగిలిన బీరును పొరుగు రాష్ట్రాలకు టీఎస్‌బీసీఎల్‌ ఎగుమతి చేస్తోంది. ఈ ఏడాది డిమాండ్‌ పెరగడంతో ఎగుమతులు నిలిపేసి పక్క రాష్ట్రాల నుంచి దిగుమతి చేసుకుంటున్నాం. హైదరాబాద్‌లో 6 గంటలకోసారి వాతావరణంలో మార్పులొస్తున్నా యని.. నవంబర్‌లో పగటి ఉష్ణోగ్రత ఎక్కువగా నమోదవడం, రాత్రి 8 వరకు పాక్షికంగా ఉక్కపోతగా ఉండటంతోనే జనం బీర్ల వైపుకు మళ్లినట్లు టీఎస్‌బీసీఎల్‌ భావిస్తోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories