ఏనుగు కుంభస్థలం బద్దలుకొట్టే ధీరుడెవడు? రంజుగా తెలంగాణ రాజకీయం

ఏనుగు కుంభస్థలం బద్దలుకొట్టే ధీరుడెవడు? రంజుగా తెలంగాణ రాజకీయం
x
Highlights

తెలంగాణలో స్వాహా కూటమి అని ఒకరు అంటే విష కూటమి అని మరొకరు అంటున్నారు...కాంగ్రెస్ టీడీపీ కూటమి ని టార్గెట్ గా అధికార పార్టీ టిఆర్ఎస్ ఆరోపణలు...

తెలంగాణలో స్వాహా కూటమి అని ఒకరు అంటే విష కూటమి అని మరొకరు అంటున్నారు...కాంగ్రెస్ టీడీపీ కూటమి ని టార్గెట్ గా అధికార పార్టీ టిఆర్ఎస్ ఆరోపణలు సంధిస్తోంది. ఇప్పటికే కాంగ్రెస్ నేతృత్వంలో మహాకూటమి ఏర్పడుతుండటంతో అంతే స్థాయిలో తిప్పికొట్టాలని బావిస్తున్నారు గులాభి పార్టీ నేతలు. ప్రతిపక్షాలన్ని గుంపుగా వచ్చిన మా నేత సింహాంలా సింగిల్ గా వస్తారని ప్రచారం చేస్తున్నారు అధికార పార్టీ నేతలు..

ఎవరికి వారు గెలుపు తమదేనని చెబుతున్నా, ఎన్నికల్లో ఒకరిపై ఒకరు పైచేయి సాధించేందుకు సకల అస్త్రాలూ ప్రయోగిస్తున్నారు. ఇప్పుడు మహా కూటమే లక్ష్యంగా అధికార నేతలు, వాగ్భాణాలు సందిస్తున్నారు. కాంగ్రెస్, టీడీపీ, సీపీఐ, జనసమితిల కూటమిని ఓడించేందుకు అన్ని ఆయుధాలు ప్రయోగిస్తోంది టీఆర్ఎస్. దుష్ట చతుష్టయంగా ఇప్పటికే అభివర్ణించిన గులాబీ నేతలు, మహాకూటమి కాదు స్వాహా కూటమిగా విమర్శల వాడి పెంచారు.

తెలంగాణలో కాంగ్రెస్ బలానికి, మహా కూటమితో టీడీపీ క్యాడర్ కూడా తోడవ్వడం, టీఆర్ఎస్‌కు మింగుడు పడటం లేదు. కాంగ్రెస్‌ని ఓడించడమే కేసీఆర్ ముందస్తు హ్యాహం కాబట్టి, ఆయన బీజేపీతో ఎంఐఎంతో లోపాయకారి ఒప్పందంతో ఎన్నికలలో విజయం సాధించి, అధికారంలోకి రావాలని ప్రయత్నం చేస్తున్నారని మహాకూటమి నేతలు ఆరోపిస్తున్నారు. అందుకు విరుగుడుగా తెలంగాణ టీడీపీని తెలంగాణ వ్యతిరేక పార్టీగా ముద్ర వేసి, కాంగ్రెస్‌ను ఆత్మబలిదానాలకు కారణంగా చూపుతూ, మహా కూటమిని ప్రజల ముందు దోషిగా నిలిపే ప్రయత్నం చేస్తోంది టీఆర్ఎస్. అంతేకాదు, తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అయ్యాక జరుగుతున్న ప్రాజెక్టుల నిర్మాణాలు, పథకాలు, నోటిఫికేషన్స్‌పై కాంగ్రెస్ వందల కేసులు వేసి, అభివృద్ధికి ఆటంకంగా కాంగ్రెస్ మారిందని ప్రచారం

అయితే టీఆర్ఎస్ నేతలు మహాకూటమిలో చేరుతున్న కోదండరాంని సైతం ప్రధానంగా టార్గెట్ చేస్తూ ఆరోపిస్తున్నారు. ఏ ఆశయం కోసం కాంగ్రెస్‌కు మద్దతిస్తున్నావని ప్రశ్నిస్తున్నారు. తెలంగాణ అమరులు ఆకాంక్షల కోసమైతే వారి చావులుకు కారణమైన కాంగ్రెస్‌తో ఏవిధంగా జట్టకడతావని ప్రశ్నిస్తున్నారు. ఇటు కాంగ్రెస్‌కు ఓటేస్తే ఢిల్లీకి బానిసలుగా మారుతామని, మహాకూటమి అధికారంలోనికి వస్తే అమరావతి నుంచే ఆదేశాలు అందుతాయని అంటున్నారు గులాబీ నేతలు. ఒక జాతీయ పార్టీ కాంగ్రెస్, ఒక ప్రాంతీయ పార్టీ టీడీపీ కలిసి మహా కూటమిగా ఏర్పడితే, కచ్చితంగా ప్రభావం చూపుతుంది అనేది టిఆర్ఎస్ భావన. అందుకే రహస్య ఒప్పందంతో మహా కూటమికి చెక్ పెట్టేందుకు బీజేపీని కలుపుకొని పోయేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తోందన్నది రాజకీయవర్గాల్లో చర్చ. ఇందులో భాగంగా బీజేపీకి ఉన్న 5 సిట్టింగ్ స్థానాలలో ఒక్క ఉప్పల్ నియోజకవర్గంలో అభ్యర్థిని ప్రకటించడం, అది కూడా గతంలో ఓడిపోయిన అభ్యర్థిని టీఆర్ఎస్‌ పోటీలో నిలపడం అధికార గులాబీ, కమలం మధ్య వికసించిన మైత్రికి నిదర్శనమని మహాకూటమి నేతలు విమర్శలు చేస్తున్నారు. వీటిని తిప్పికొట్టేందుకు ప్రయత్నిస్తోంది టీఆర్ఎస్.

టిఆర్ఎస్, బీజేపీలు విడివిడిగా పోటీ చేసి అధికారం తమదేనని చెప్పుకుంటున్నా, అంతిమంగా కాంగ్రెస్ టీడీపీల నేతృత్వంలోని మహా కూటమి ఓటమే లక్ష్యంగా, రెండు పార్టీలూ ప్రచారం చేస్తున్నాయని...అందుకే మహా కూటమిని స్వాహా కూటమి అని టిఆర్ఎస్ అంటుంటే...విష కూటమిగా ఆరోపిస్తోంది బీజేపీ. ఫైనల్‌గా అభ్యర్థుల ప్రకటన దగ్గర నుంచి మహా కూటమిని ఓడగొట్టే వరకు టిఆర్ఎస్, బీజేపీలు ప్రక్క ప్రణాళికతో ముందుకు సాగుతున్నాయన్న చర్చ జరుగుతోంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత చేసిన అభివృద్ధితో పాటు ప్రజలకు అందుతున్న పథకాల గురించి, ప్రజలకు వివరిస్తూ..గతంలో పాలించిన కాంగ్రెస్, ప్రజలకు చేసిందేమీలేదని విమర్శలు చేస్తున్నారు టిఆర్ఎస్ నేతలు. అదేవిధంగా లోపాయకారిగా అటు బీజేపీతో ఇటు ఎంఐఎంతో కలిసి మళ్లీ అధికారంలోనికి రావడానికి టీఆర్ఎస్ ప్రయత్నాలు చేస్తోందని మహాకూటమి నేతలు ఆరోపిస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories