ఓటు వేసిన ప్రముఖులు వీరే..

Submitted by nanireddy on Fri, 12/07/2018 - 08:32
telangana poling updates

తెలంగాణ వ్యాప్తంగా పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. ఉదయం 6:45 గంటల నుంచి ఓటర్లు పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరారు. చాలా మంది ప్రముఖులు ఉదయాన్నే ఓటు హక్కును వినియోగించుకున్నారు. వారిలో సిద్దిపేటలో హరీష్‌రావు దంపతులు, సూర్యాపేటలో జగదీశ్వర్‌రెడ్డి, ఖమ్మం జిల్లాలో తుమ్మల నాగేశ్వరరావు ఓటు వేశారు. పద్మా దేవెందర్‌రెడ్డి, జోగు రామన్న, జీహెచ్‌ఎంసీ కమీషనర్‌ దానకిషోర్‌, ఎంపీ వినోద్‌ కుమార్‌, రాథోడ్ రమేష్‌, గుత్తా సుఖేందర్‌ రెడ్డి, సీపీ మహేష్‌ భగవవత్‌ తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ పబ్లిక్ స్కూల్లో సంగీత దర్శకుడు కీరవాణి కుటుంబం. అలాగే  జూబ్లీహిల్స్ లోని బీఎస్ ఎన్ ఎల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన పోలింగ్ బూత్ లో అల్లు అర్జున్ ఓటేశారు. నాగార్జున, అమల తమ ఓటు  హక్కును వినియోగించుకున్నారు. ఇక దర్శకుడు రాజమౌళి, ప్రముఖ బ్యాడ్మింటన్ ప్లేయర్ పీవీ సింధు జూబిలీహిల్స్ లో తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. 

English Title
telangana poling updates

MORE FROM AUTHOR

RELATED ARTICLES