జులైలో పంచాయతీ ఎన్నికలు...ప్రభుత్వానికి షెడ్యూల్‌ను అందజేసిన ఈసీ

జులైలో పంచాయతీ ఎన్నికలు...ప్రభుత్వానికి షెడ్యూల్‌ను అందజేసిన ఈసీ
x
Highlights

తెలంగాణలో గ్రామ పంచాయతీ ఎన్నికలను జులైలో నిర్వహించనున్నారు. దీనికి సంబంధించి ఎన్నికల షెడ్యూల్‌ను రాష్ట్ర ఎన్నికల సంఘం తాజాగా ప్రభుత్వానికి అందజేసింది....

తెలంగాణలో గ్రామ పంచాయతీ ఎన్నికలను జులైలో నిర్వహించనున్నారు. దీనికి సంబంధించి ఎన్నికల షెడ్యూల్‌ను రాష్ట్ర ఎన్నికల సంఘం తాజాగా ప్రభుత్వానికి అందజేసింది. దీంతో ఎన్నికల ఏర్పాట్ల కోసం రాష్ట్ర ఆర్థిక శాఖ 30కోట్లను పంచాయతీరాజ్‌ శాఖకు విడుదల చేసింది. పంచాయతీ ఎన్నికలకు వేళైంది. ఈసీ ఎన్నికల షెడ్యూల్‌ను ప్రభుత్వానికి అందజేసింది. దీంతో ప్రభుత్వం ఎన్నికలకు మొత్తం 120కోట్లు ఖర్చవుతుందని అంచనా వేసింది. గ్రామ పంచాయతీ సాధారణ ఎన్నికలను జూన్‌ నెలలోనే నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల సంఘం ఇటీవల ప్రతిపాదించి తాత్కాలిక షెడ్యూల్‌ను సైతం రూపొందించింది.

రిజర్వేష్లకు తగినంత వ్యవధి ఇవ్వకుంటే కోర్టు వివాదాలు ఉత్పన్నమయ్యే ఆస్కారం ఉండటంతో కొంత ఆలస్యమైనప్పటికీ ఏర్పాట్లను పకడ్బందీగా చేపట్టాలని సర్కార్ నిర్ణయించడంతో షెడ్యూల్‌లో మార్పులు అనివార్యమయ్యాయి. ఈసీ తన తొలి ప్రతిపాదనలను సవరించుకొని మొదటి విడత ఎన్నికలను జూన్ మూడో వారంలో మొదలు పెట్టాలని భావించినప్పటికీ తాజాగా ఆ ప్రతిపాదననూ పక్కన పెట్టి మొత్తం మూడు విడతలను జులై నెలలోనే చేపట్టేందుకు వీలుగా మరో షెడ్యూల్‌ను రూపొందించి ప్రభుత్వానికి అందజేసింది.

ఈసీ ప్రకటనలు ప్రాంతాల వారీగా మూడు విడతల్లో మూడేసి రోజుల వ్యవధిలో వెలువడతాయి. ప్రకటన వెలువడిన రోజు నుంచి 15వరోజున పోలింగ్ నిర్వహిస్తారు. అదేరోజున ఓట్ల లెక్కింపు, ఫలితాల వెల్లడి ఉంటుంది. ఈ క్రమంలో కొత్త పాలకవర్గ్గాలు శిక్షణ లేకుండానే ఆగస్టు 1న కొలువు తీరనున్నాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories