తెలంగాణలో మహానాడు సర్వం సిద్ధం

తెలంగాణలో మహానాడు సర్వం సిద్ధం
x
Highlights

తెలంగాణ తెలుగు దేశం మహానాడుకు సర్వం సిద్ధమైంది. నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో గురువారం నాడు జరిగే మహానాడుకు సీఎం చంద్రబాబనాయుడు ముఖ్య అథితిగా...

తెలంగాణ తెలుగు దేశం మహానాడుకు సర్వం సిద్ధమైంది. నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో గురువారం నాడు జరిగే మహానాడుకు సీఎం చంద్రబాబనాయుడు ముఖ్య అథితిగా హాజరుకానున్నారు.. మహానాడులో మొత్తం 8 తీర్మాణాలపై నేతలు చర్చిస్తారు. వచ్చే ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలు, ఎత్తుగడులు, పొత్తులు, నాయకత్వ మార్పు తదితర అంశాలపై చర్చలు సాగనున్నాయి.

తెలంగాణలో టీడీపీ పండగకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. మహానాడులో పార్టీ గత చరిత్ర, పోరాటాలను నెమరు వేసుకోవడంతో పాటు.. భవిష్యత్తు కార్యచరణను రూపొందించి కార్యకర్తలను చంద్రబాబు దిశానిర్దేశం చేస్తారు. ఒకప్పుడు తెలంగాణలో బలంగాఉన్న టీడీపీ.. ప్రత్యేక రాష్ట్ర ఉద్యమ కాలం నుంచి బలహీన పడుతూ వచ్చింది.. అయినా గత ఎన్నికల్లో 15 అసెంబ్లీ, ఒక ఎంపీ స్థానాన్ని గెలుచుకుంది.. అయితే చాలా మంది సీనియర్లు తమ దారి తాము చూసుకోవడంతో.. ప్రస్తుతం ఇద్దరు ఎమ్మెల్యేలు మాత్రమే టీడీపీకి మిగిలారు..

టీడీపీ తెలంగాణలో మనుగడ సాధించడం కష్టమనుకుంటున్న తరుణంలో జరుగుతున్న మహానాడు సమీవేశాలను పార్టీ సీరియస్‌గా తీసుకుంది. వచ్చేది ఎన్నికల ఏడాది కావడంతో... పార్టీని బలోపేతం చేసి వీలైనన్ని ఎక్కవ సీట్లను గెలుచుకోవాలని పార్టీ నేతలు భావిస్తున్నారు. తెలంగాణలో టీడీపీకి నిర్ధిష్ట ఓటు బ్యాంకు ఉన్న నేపథ్యంలో.. ఇతర పార్టీలు పొత్తు పెట్టుకునేందుకు ఆసక్తి కనబరుస్తున్నాయి. మరోవైపు కర్ణాటకలో మూడో పార్టీగా ఉన్న జేడీఎస్ అధికారంలోకి రావడంతో.. టీ టీడీపీ నేతల్లో కొత్త ఆశలు చిగురిస్తున్నాయి.. కనీసం 10 సీట్లు గెలుచుకుంటే తెలంగాణ రాజకీయాల్లో చక్రం తిప్పొచ్చని నేతలు భావిస్తున్నారు.

ఇక మహానాడులో మొత్తం 8 తీర్మాణాలపై చర్చలు జరపనున్నారు. అమలుకు నోచుకోని టీఆర్ఎస్ హామీలు, సంక్షోభంలో తెలంగాణ వ్యవసాయం, నిరుద్యోగ సమస్యతో పాటు పలు కీలకాంశాలపై తీర్మాణాలు చేయనున్నారు.. మహానాడులో ఏపీ సీఎం చంద్రబాబు పార్టీ భవిష్యత్తు కార్యాచరణ ప్రకటించనున్నారు.. టీడీపీపై అన్ని వైపుల నుంచి దాడులు పెరిగిన నేపథ్యంలో చంద్రబాబు నాయుడు ఏం మాట్లాడుతారన్న ఆసక్తి నెలకొంది.. వచ్చే ఎన్నికల్లో పొత్తులపై ఏం చెబుతారో అని కార్యకర్తలు, నేతలు ఎదురు చూస్తున్నారు. అయితే ఎన్డీఏ నుంచి బయటకు వచ్చిన తర్వాత.. బీజేపీ వ్యతిరేక శక్తులతో కలిసి సాగాలని నిర్ణయించారు.. ఏపీ, తెలంణలో పార్టీ ప్రయోజనాల దృష్టిలో పెట్టుకొని.. కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకోవాలని యోచిస్తున్నట్లు తెలుస్తోంది.

మొత్తానికి నేతల వలసలతో డీలా పడ్డ తెలంగాణ తెలుగు తమ్ముళ్లు నడిపించడంలో.. రమణ అండ్ టీం సమర్ధవంతంగా పనిచేయడం లేదని కార్యకర్తలు తీవ్ర అసంతృప్తిగా ఉన్న నేపథ్యంలో.. టీటీడీపీ అధ్యక్షుడిగా రమణకు మరో సారి అవకాశం కల్పిస్తారా...? లేక కొత్త నేతలను ఎంపిక చేస్తారా..? అన్న ఆసక్తి నెలకొంది.. ‎

Show Full Article
Print Article
Next Story
More Stories