అజ్ఞాతవాసికి ఇద్ద‌రూ మిత్రులే

Submitted by lakshman on Wed, 01/10/2018 - 06:52

 ప‌వ‌న్ క‌ల్యాణ్ - త్రివిక్ర‌మ్ కాంబినేష్ లో అజ్ఞాతవాసి సినిమా విడుద‌లై మంచి టాక్ ను సొంతం చేసుకుంది. అయితే ఈ సినిమా విడుద‌ల నేప‌థ్యంలో కొన్ని ఆటంకాలు ఎదుర‌య్యాయి. సినిమా టికెట్ల రేట్ల‌ను పెంచాల‌ని,  ప్రీమియర్ షోల‌ను పెంచే ప్ర‌య‌త్నం చేసింది ఆ చిత్ర యూనిట్. అందుకు స‌హ‌క‌రించిన ఏపీ ప్ర‌భుత్వం పవన్ కళ్యాణ్ ను నెత్తిన పెట్టుకుంది. తెలంగాణ సర్కారు మాత్రం చాలా లైట్ తీసుకుంది. పవన్ కళ్యాణ్ అడగగానే ఏకంగా 24 గంటల పాటు సినిమాల ప్రదర్శనకు గ్రీన్  సిగ్నల్ ఇచ్చారు. అంటే సుమారు రోజుకు 7 ఆట‌లు  ప్రదర్శించేలా ఉత్తర్వులు జారీ చేసింది. దీనికి తోడు ప్రీమియ‌ర్ షోలుకు అనుమ‌తిచ్చింది. దీనిపై విమ‌ర్శ‌లు వెల్లువెత్తాయి. ప‌వ‌న్ - చంద్ర‌బాబు సాంగ‌త్యంపై కొంత‌మంది సెటైర్లు వేశారు. 
కానీ పవర్‌ స్టార్‌ పవన్‌ కల్యాణ్‌కు తెలంగాణ సర్కార్‌ షాకిచ్చింది. ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కలిసినా లైట్‌ తీసుకున్న తెలంగాణ ప్రభుత్వం ‘అజ్ఞాతవాసి’ ప్రీమియర్ షోలకు నో చెప్పింది. అర్ధరాత్రి స్పెషల్‌ షోలు వేయొద్దంటూ థియేటర్లకు స్పష్టమైన ఆదేశాలిచ్చింది.  గతంలో కూడా ప్రీమియర్ షోలు వేసినప్పుడు పలుచోట్ల తొక్కిసలాటలు జరిగిన విషయాన్ని గుర్తు చేస్తూ అభిమానులు సహకరించాలని పోలీసులు కోరారు.
అయితే తెలంగాణ‌లో ప్రీమియ‌ర్ షోల‌కు నోచెప్పిన ప్ర‌భుత్వం ..కొద్దిసేప‌టికే అనుమ‌తిచ్చేసింది. అది ఎలా అంటే ప‌వ‌న్ మేనియా దృష్ట్యా అర్థారాత్రి షోలకు అనుమతివ్వడం కుదరదని పోలీస్ శాఖ తెలపడంతో 10వ తేదీ ఉదయం నుండి రెగ్యులర్ గా వేసే 4 రోజులతో పాటు అదనంగా ఒక షోను వేయవచ్చని, అది కూడా ఉదయం 8 గంటలకు వేయాలని అనుమతులిచ్చారు. దీంతో ఇప్పటి వరకు నడుస్తున్న స్పెషల్ షోల సందిగ్దత తొలగిపోయింది

English Title
telangana government -granted-permission-to-screen-5-shows-for-agnyaathavaasi

MORE FROM AUTHOR

RELATED ARTICLES