పాడి రైతులకు గేదెల పంపిణీకి రెడీ అయిన తెలంగాణ సర్కార్

Submitted by arun on Sat, 02/10/2018 - 11:15
buffalo

ఇప్పటివరకు చేప పిల్లలు, గొర్రె పిల్లలు పంపిణీ చేసిన తెలంగాణ ప్రభుత్వం.. పాడి రైతులకు గేదెలు పంపిణీ చేసేందుకు రెడీ అవుతోంది. ఎస్సీ, ఎస్టీలకు 75 శాతం, ఇతరులకు 50 శాతం సబ్సిడీతో.. గేదెలను పంపిణీ చేయనుంది. ఇందుకోసం.. రాష్ట్ర బడ్జెట్‌లో 970 కోట్లు పెట్టేందుకు ప్రతిపాదనలు కూడా రెడీ అయ్యాయి.

తెలంగాణలో పాల ఉత్పత్తిని పెంచడంతో పాటు.. పాడి రైతులను ప్రోత్సహించేందుకు గేదెల పంపిణీకి ప్రభుత్వం ప్లాన్ చేస్తోంది. రాష్ట్రంలో ప్రస్తుతం విజయ, మదర్, కరీంనగర్, ముల్కనూర్ డైరీ సహకార సంఘాలున్నాయి. వీటి పరిధిలో 2 లక్షల 17 వేల మంది పాడి రైతులు సభ్యులుగా ఉన్నారు. ఒక్కో గేదెను లక్ష వ్యయంతో కొనుగోలు చేసి.. ఒక్కో రైతుకు ఒక్కో గేదెను రాయితీ కింద పంపిణీ చేయనున్నారు. అందుకనుగుణంగా.. పశుసంవర్ధక శాఖ ప్రతిపాదనలు రూపొందించింది. ఎస్సీ, ఎస్టీ రైతులకు 75 శాతం, మిగతా వారికి 50 శాతం సబ్సిడీతో పాడి గేదెలను అందించనున్నారు.

గేదెలు కొనుగోలు చేసేందుకు.. అధికారులు ఇప్పటికే హర్యానా, పంజాబ్‌, చత్తీస్‌గఢ్‌, మహారాష్ట్ర, కర్ణాటక, కేరళ, తమిళనాడు రాష్ట్రాల్లో పర్యటించి వచ్చారు. హర్యానా, పంజాబ్‌లో ఉన్న గేదెలు రోజుకు రెండు పూటలా.. 20 నుంచి 30 లీటర్ల వరకు పాలు ఇస్తున్నాయని గుర్తించారు. అక్కడ ఉన్న ఒక్కో గేదె కొనుగోలుకు.. 65 నుంచి 90 వేల వరకు ఖర్చవుతుందని అంచనా వేశారు అధికారులు.

ఈ జూన్ నుంచి.. గేదెల పంపిణీ చేసేందుకు ప్రభుత్వం రెడీ అవుతోంది. ఇందుకోసం రాష్ట్ర బడ్జెట్‌లో 970 కోట్లకు పైగా అవసరమవుతాయని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ మేరకు పశుసంవర్ధకశాఖ ప్రతిపాదనలు సిద్ధం చేసింది. గేదెల పంపిణీ పథకానికి సంబంధించి.. సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ఈ బడ్జెట్‌లోనే.. ఈ పథకంపై కేసీఆర్ ప్రకటన చేసే అవకాశం ఉందంటున్నారు సెక్రటేరియట్ అధికారులు.
 

English Title
telangana government to give buffaloes at 50 percent subsidy to farmers

MORE FROM AUTHOR

RELATED ARTICLES