తెలంగాణలో 10వేల సీట్లకు కోత

Submitted by santosh on Mon, 05/07/2018 - 10:40
telangana engineering colleges

తెలంగాణలో ఇంజినీరింగ్‌ కాలేజీల్లో...సీట్ల కోత మొదలైంది. అఖిల భారత సాంకేతిక విద్యా మండలి సీట్ల కోత పని పూర్తి చేసింది. 2018-19 సంవత్సరానికి భారీ సంఖ్యలో ఇంజినీరింగ్ కళాశాలలను మూసేసింది. దీనికి సంబంధించి ఏఐసీటీఈ రాష్ట్రంలోని కాలేజీలు, సీట్ల జాబితాను ప్రకటించింది.తెలంగాణలో 228 ఇంజినీరింగ్ కాలేజీల్లో లక్షా 14వేల 117 సీట్లకు అనుమతిచ్చింది. 2017-18 విద్యాసంవత్సరంతో పోల్చితే కాలేజీలు, సీట్ల సంఖ్య భారీగా తగ్గింది. ఈ ఏడాది 14 ఇంజినీరింగ్ కాలేజీలను మూసివేయడంతో పాటు 10వేల 647 సీట్లకు కోత పెట్టింది.

అత్యధికంగా రంగారెడ్డి జిల్లాలోని ఆరు కళాశాలలు మూతపడితే...అదే స్థాయిలో 3వేల 906 సీట్లకు కోత విధించింది ఏఐసీటీఈ. అన్ని జిల్లాల్లో ఇంజినీరింగ్ కళాశాలల్లో సీట్లు తగ్గితే...హైదరాబాద్‌లో మాత్రం 525 సీట్లు పెరిగాయ్. 2017-18లో ఏఐసీటీఈ రాష్ట్రంలో 242 ఇంజనీరింగ్‌ కాలేజీల్లో లక్షా 24వేల 239 సీట్లకు అనుమతి ఇచ్చింది. తాజాగా మూతపడిన వాటిలో మెజారిటీ కళాశాలలు స్వచ్ఛందంగా మూసివేతకు దరఖాస్తు చేసుకుంటే...మరి కొన్నింటికి ఏఐసీటీఈ కోత పెట్టింది. ఈ ప్రక్రియ పూర్తి కావడంతో జేఎన్‌టీయూ వంతు మొదలుకానుంది. ఏఐసీటీఈ గుర్తింపు పొందిన కాలేజీలకు మాత్రమే జెఎన్‌టీయూ అనుబంధం సంస్థ గుర్తింపును జారీ చేస్తుంది.

తెలంగాణలో ఇప్పటికే ఇంజినీరింగ్ కళాశాలల్లో తనిఖీలు పూర్తి అయ్యాయ్. 2018-19 సంవత్సరానికి జెఎన్టీయూ కూడా భారీ సంఖ్యలో సీట్లకు కోత విధించే అవకాశాలున్నాయ్. జెఎన్‌టీయూ పరిధిలోని 187 ఇంజినీరింగ్ కాలేజీల్లో 10వేల సీట్లను రద్దు చేసే అవకాశాలున్నాయ్.

English Title
telangana engineering colleges

MORE FROM AUTHOR

RELATED ARTICLES