దీటుగా దడ పుట్టిస్తున్న రెబల్స్ ? ఎన్నికల్లో చక్రం తిప్పబోతున్నారా?

దీటుగా దడ పుట్టిస్తున్న రెబల్స్ ? ఎన్నికల్లో చక్రం తిప్పబోతున్నారా?
x
Highlights

తెలంగాణ ఎన్నికల్లో స్వతంత్రులు చక్రం తిప్పబోతున్నారా..? హంగ్ అసెంబ్లీ ఏర్పడవచ్చన్న కొన్ని అంచనాల నేపథ్యంలో రాజకీయ పార్టీలు ఇండిపెండెంట్స్‌కు గాలం...

తెలంగాణ ఎన్నికల్లో స్వతంత్రులు చక్రం తిప్పబోతున్నారా..? హంగ్ అసెంబ్లీ ఏర్పడవచ్చన్న కొన్ని అంచనాల నేపథ్యంలో రాజకీయ పార్టీలు ఇండిపెండెంట్స్‌కు గాలం వేయడం మొదలు పెట్టేశాయా..? ఎన్నికల ఫలితాల వెల్లడికి ముందే బేరసారాలు ప్రారంభమయ్యాయా? డబ్బులు, కీలక పదవులపై స్వతంత్రులకు ప్రధాన పార్టీలు హామీ ఇచ్చేశాయా..?

తెలంగాణ ఎన్నికల్లో 7 నుంచి 10 మంది వరకు స్వతంత్రులు గెలుస్తారని సర్వేలు చాటింపు వేయడంతో ఇప్పుడు అందరి దృష్టి ఆ లక్కీ ఫెలోస్ ఎవరనే అంశంపైనే ఉంది. సుమారు 20కి పైగా నియోజకవర్గాల్లో తిరుగుబాటు అభ్యర్థులు పోటీ చేస్తే వారిలో ఏడెనిమిది మంది విజయం సాధించే అవకాశాలున్నాయని ప్రచారం జరుగుతోంది. ఒకవేళ హంగ్ వంటి పరిస్థితులు ఎదురైతే స్వతంత్రులను ప్రసన్నం చేసుకునే అంశంపై ప్రధాన పార్టీల నేతలు దృష్టి సారించారు. ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి స్వతంత్రుల మద్దతు తీసుకోవాల్సి వస్తే వారి మద్దతు కూడగట్టుకునే యత్నాలు పోలింగ్‌కు ముందు నుంచే ప్రారంభించారు. గెలిచే అవకాశాలున్న స్వతంత్ర అభ్యర్థులతో కాంగ్రెస్, టీఆర్ఎస్ నేతలు వారం క్రితమే చర్చలు ప్రారంభించారు.

టిక్కెట్ దక్కక పోవడంతో తిరుబాటు అభ్యర్థులుగా బరిలో నిలిచిన వారితో దగ్గరయ్యేందుకు ఆయా పార్టీల నేతలు మాటలు కలుపుతున్నారు. నువ్వు మా వాడివే అంటూ స్నేహ హస్తం కలిపేందుకు యత్నిస్తున్నారు. తిరుగుబాటు అభ్యర్థులకు అత్యంత సన్నిహితులైన వారితో మంతనాలు సాగిస్తున్నారు. రెబెల్స్‌కు రాజకీయ గురువులుగా భావించే ముఖ్యనేతలూ రంగంలోకి దిగి మంత్రాంగం నడుపుతున్నారు. గెలిచే అవకాశమున్న అభ్యర్థులను తమ వైపునకు తిప్పుకొనే క్రమంలో టీఆర్ఎస్, కాంగ్రెస్ ముందస్తు ఒప్పందాలూ చేసుకొంటున్నట్లు సమాచారం. ఈ సందర్భంగా పలు రకాల ఆఫర్లు ప్రకటిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.

గెలిచే ఛాన్సున్న స్వతంత్రులను లైన్‌లో పెట్టడానికి డబ్బు, పదవులు ఎరవేస్తున్నారు. ఎన్నికల ఖర్చంతా భరిస్తామని అలాగే మంత్రి పదవి ఇచ్చే అంశాన్ని పరిశీలిస్తామని అది వీలుకాకనపోతే కేబినెట్‌ హోదా కలిగిన ఇతర పదవులైనా సరే ఇవ్వడానికి సిద్ధమని ప్రతిపాదిస్తున్నారు. అయితే తిరుగుబాటు అభ్యర్థులు మాత్రం ఆచితూచి వ్యవహరిస్తున్నారు. మెరుగైన ప్రతిపాదనలపై దృష్టిసారించినట్లు తెలిసింది. దీంతో ఇప్పుడే ఏమీ చెప్పలేని ఓట్ల లెక్కింపు రోజు చర్చిద్దామని దాటవేస్తున్నారు. మరి తెలంగాణ ఎన్నికల్లో హంగ్ వస్తుందా..? స్వతంత్రు పంట పండుతుందా కొద్ది గంటల్లో తేలనుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories