ఈసీ ఆంక్షలతో రంగంలోకి నిఘా బృందాలు..

x
Highlights

తెలంగాణ శాసనసభ ఎన్నికల షెడ్యూల్‌ను కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించడంతో రాష్ట్రంలో తక్షణమే ఎన్నికల ప్రవర్తనా నియమావళి పూర్తిస్థాయిలో అమల్లోకి వచ్చింది....

తెలంగాణ శాసనసభ ఎన్నికల షెడ్యూల్‌ను కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించడంతో రాష్ట్రంలో తక్షణమే ఎన్నికల ప్రవర్తనా నియమావళి పూర్తిస్థాయిలో అమల్లోకి వచ్చింది. దీంతో ఎన్నికల కోడ్‌ అమలుపై ఎన్నికల సంఘం దృష్టి పెట్టింది. ప్రభుత్వ ఆస్తులు, ప్రభుత్వ కార్యాలయ సముదాయాలు, ప్రభుత్వ ప్రాంగణాలను పార్టీలు దుర్వినియోగం చేయరాదని ఈసీ ఆదేశాలు జారీ చేసింది. ఆయా ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన ఎన్నికల ప్రచార హోర్డింగ్‌లు, ఫ్లెక్సీలు, పోస్టర్లను 24 గంటల్లోగా తొలగించాలని ఆదేశాలు జారీ చేయడంతో ప్రభుత్వ సిబ్బంది రంగంలోకి దిగారు. వివిద ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు, హోర్డింగులను హుటా హుటిన తొలగిస్తున్నారు.

తెలంగాణలోని రైల్వే స్టేషన్లు, బస్టాండ్లు, విమానాశ్రయాలు, రైల్వే వంతెనలు, రహదారులు, బస్సులకు అతికించిన ప్రచార సామగ్రిని వెంటనే తొలగించాలని ఎన్నికల సంఘం ఆదేశించింది. ప్రభుత్వ కార్యాలయాల్లో ఉన్న అన్ని పోస్టర్లు, కటౌట్లు తొలగించాలని అలాగే..24 గంటల్లో రైల్వేస్టేషన్, బస్‌స్టేషన్లు, విమానాశ్రయాల్లో పోస్టర్లు, బ్యానర్లు తొలగించాలని ఆదేశించింది. ఇంటి యజమాని అనుమతితోనే బ్యానర్లు కట్టాలని. వాల్ పోస్టర్లు అతికించాలని ఒకవేళ ఇంటి యజమాని అనుమతి తీసుకోకపోతే.. 72 గంటల్లో వాటిని తొలగించాలని సూచించింది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల విడుదలైన వెంటనే హైదరాబాద్‌లో GHMC సిబ్బంది రంగంలోకి దిగారు. ఫ్లెక్సీలు, హోర్డింగుల తొలగింపు చర్యలు చేపట్టారు. ప్రభుత్వ, పార్టీల ఫ్లెక్సీలు, హోర్డింగులు వెంటనే తొలగించాలని ఈసీ ఆదేశించడంతో రాత్రి కూడా ఈ కార్యక్రమం కొనసాగింది.


తెలంగాణలో ఎన్నికల ప్రవర్తనా నియమావళి పూర్తిస్థాయిలో అమల్లోకి వచ్చిందని ఎన్నికల సంఘం సీఈవో రజత్ కుమార్ నిన్ననే ప్రకటించారు. ప్రభుత్వ కార్యాలయాలు, ఇతర ప్రాంతాల్లో పోస్టర్లు, కటౌట్లు తొలగించాలని ఆదేశించారు. అలాగే అభివృద్ధి కార్యక్రమాలు 72 గంటల్లోగా నిలిపివేయాలన్న రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి రజత్ కుమార్ అధికారిక వాహనాలను వాడొద్దని ఆదేశించారు. ఇక ఉదయం 6గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు మాత్రమే ఎన్నికల ప్రచారం నిర్వహించాలని స్పష్టం చేశారు. అధికారిక వాహనాలపై నిషేధం..: ప్రభుత్వాధికారులు మినహా రాజకీయ పార్టీల అభ్యర్థులు, ఎన్నికల వ్యవహారాల్లో పాల్గొనే వ్యక్తులు అధికారిక వాహనాలు వినియోగించడంపై నిషేధం అమల్లోకి వచ్చిందని రజత్‌ కుమార్‌ స్పష్టం చేశారు. ప్రభుత్వ వెబ్‌సైట్లలో రాజకీయ నాయకుల ఫొటోలు ఉండరాదన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories