పాపం కుంతియా

పాపం కుంతియా
x
Highlights

తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నేతలు ఇంచార్జ్ కుంతియాను లైట్ తీసుకుంటున్నారా....? భవిష్యత్ కార్యాచరణపై ఆయన వరుసగా కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నా కొందరు...

తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నేతలు ఇంచార్జ్ కుంతియాను లైట్ తీసుకుంటున్నారా....? భవిష్యత్ కార్యాచరణపై ఆయన వరుసగా కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నా కొందరు సీనియర్లు పట్టించుకోవడం లేదా.....? తాజాగా నేతలతో ముఖాముఖి నిర్వహించినా కొందరు డుమ్మా కొట్టడం వెనుక ఆంతర్యమేమిటి.....? కుంతియాను ఇంచార్జ్ గా భావించడంలేదా....? లేదంటే ఆయనతో వచ్చేదేమయీ లేదని భావిస్తున్నారా..?

తెలంగాణ కాంగ్రెస్ ఇంచార్జ్ గా పూర్తి స్థాయి బాధ్యతలు స్వీకరించిన తరువాత కుంతియా పార్టీ నేతలతో మమేకమయ్యేందుకు యత్నిస్తున్నారు. తెలంగాణలో ఏ చిన్న కార్యక్రమాన్ని నేతలు నిర్వహించినా హాజరవుతున్నారు. కానీ ఆయనలో ఉన్నంత సీరియస్‌నెస్ ఇక్కడి నేతల్లో కనిపించడంలేదనిపిస్తోంది. రెండ్రోజుల క్రితం నేతల అభిప్రాయాన్ని తెలుసుకోవడానికి గాంధీ భవన్ లో కుంతియా వ్యక్తిగతంగా భేటి అయ్యారు. చాలామంది సీనియర్ నేతలు రెండు రోజులు జరిగిన ముఖాముఖి కార్యక్రమానికి హాజరయినా.. కొంతమంది సీనియర్లే డుమ్మా కొట్టారు. కుంతియాతో ముఖాముఖికి గైర్హాజరైన నేతలు..హైదరాబాద్ లో ఉండి కూడా ఆ కార్యక్రమానికి దూరంగా ఉండటం విశేషం.

సీనియర్లు, పెద్ద పెద్ద పదవులు అనుభవించినవారంతా కుంతియా ఫేస్ టు ఫేస్‌కు హాజరు కాలేదు. మాజీ డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహ్మ, డీ.కే.అరుణ, చిన్నారెడ్డి, జీవన్ రెడ్డి, సుధీర్ రెడ్డి, సునీతా లక్ష్మారెడ్డి, గండ్ర వెంకట రమణారెడ్డి, రేవంత్ రెడ్డి, ముఖేష్ గౌడ్ ఈ జాబితాలో ఉన్నారు. కుంతియాతో భేటీ వల్ల వచ్చే లాభామేముందనే భావనతో వీరంతా ఉన్నట్లు తెలుస్తోంది. పార్టీ సంబందించిన అంశాలపై చాలాసార్లు కుంతియాతో మాట్లాడామనీ...ఇక కొత్తగా మాట్లాడేది ఏముందని వారు పెదవి విరిచినట్లు సమాచారం. అయితే కుంతియాతో చర్చించే అంశాలు గోప్యంగా ఉంటాయా. లేదా.. అనే అనుమానం కొందరి నేతల్లో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. అందుకే ఆయనతో భేటీకి దూరంగా ఉన్నట్లు తెలుస్తోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories