ఇదీ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్లాన్....06-09-18...6+9+1+8=24...2+4=6

ఇదీ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్లాన్....06-09-18...6+9+1+8=24...2+4=6
x
Highlights

తెలంగాణలో ముందస్తు కసరత్తు జరుగుతోంది. అసెంబ్లీ రద్దు చేస్తారన్న ప్రచారం నడుస్తోంది. తిథి, వార నక్షత్రాలు, ముహుర్తాలు, లగ్న బలాల లెక్కల ప్రకారమే...

తెలంగాణలో ముందస్తు కసరత్తు జరుగుతోంది. అసెంబ్లీ రద్దు చేస్తారన్న ప్రచారం నడుస్తోంది. తిథి, వార నక్షత్రాలు, ముహుర్తాలు, లగ్న బలాల లెక్కల ప్రకారమే నడుచుకునే టీఆర్‌ఎస్‌ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఇప్పుడు కూడా ఆ లెక్క ప్రకారమే ముందస్తుకు వెళ్తున్నారా? ఆ లెక్క ప్రకారమే శాసనసభను రద్దు చేస్తారా? ఆరో తారీఖు, గురువారం, పుష్యమి నక్షత్రం అసలు ఈ లెక్కకు అర్థమేంటి.?

తెలంగాణలో ముందస్తు హడావిడి నెలకుపైగానే నడుస్తుంది. ఇప్పుడు అప్పుడు అంటూ లాక్కొచ్చారు. మొత్తానికి ఇప్పుడో కన్‌క్లూజన్‌కు వచ్చారు. షెడ్యూల్‌కు ముందే అసెంబ్లీ రద్దు చేయడమంటే మాటలు కాదు. దానికి సరైన కారణం చూపాలి. న్యాయపరమైన చిక్కులు ఎదురుకాకుండా చూసుకోవాలి. ఇన్నీ చూసుకున్నా ముహుర్తం బలం కావాలి. తారాబలం కలసి రావాలి. ఇదీ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్లాన్‌.

కేసీఆర్ లక్కీనెంబరు 6. నేడు తేదీ, నెల, సంవత్సరం కలపితే 24. దీన్ని కూడితే కూడా వచ్చేది ఆరే. ఇదీ సంఖ్యాశాస్త్రం ప్రకారం.
06-09-18
6+9+18=24
2+4=6

ఇక జ్యోతిషశాస్త్రాన్ని పక్కాగా నమ్మే కేసీఆర్‌ ఆరో తేదీ గురువారాన్ని ఎంచుకోవడానికి పండితులతో చర్చలు జరిపి ఉంటారు. సహజంగానే శాస్త్రంపై పట్టుకున్న సీఎం అందులో ఉన్న మర్మాన్ని జ్యోతిషవేత్తలతో మాట్లాడి అర్థం చేసుకొని ఉంటారు. వాస్తవానికి 6వ తేదీ గురువారం మధ్యాహ్నం తర్వాత పుష్యమి నక్షత్రం వస్తుంది. కేసీఆర్ జన్మనక్షత్రం ఆశ్లేష. అప్పుడు పుష్యమి నక్షత్రం కేసీఆర్‌కు తారాబలం ప్రకారం పరమ మిత్ర తార అవుతుంది. అందులోనూ గురువారం పుష్యమి నక్షత్రం కలసిరావడం గురుపుష్యయోగానికి కారణం. ఇది తిరుగులేని అమృతసిద్ధి యోగాన్ని ఇస్తుందంటున్నారు జ్యోతిషవేత్తలు.

ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల దాకా చంద్రహోర ఉంది. ప్రత్యర్థుల మీద పైచేయి సాధించడానికి చంద్ర హోర చాలా మంచిది. మధ్యాహ్నం ఒంటిగంట నుంచి 2 గంటల దాకా గురు హోర ఉంటుంది. సాధకులకు మంచి సమయం ఇది. గురుపుష్య యోగం ఉన్న రోజు తలపెట్టిన పని తిరుగులేకుండా విజయవంతమవుతుందని నమ్మకం వల్ల కూడా కేసీఆర్ ఆరో తేదీని నిర్ణయించి ఉంటారని భావిస్తున్నారు పండితులు.

Show Full Article
Print Article
Next Story
More Stories