తెలంగాణ బీజేపీ ఎన్నిక‌ల ఇంఛార్జ్ గా రాంమాదవ్..?

Submitted by arun on Fri, 02/02/2018 - 12:03
Ram Madhav

జమ్మూకాశ్మీర్ ను ఎన్డీయే ఖాతాలో వేసిన బీజేపీ నాయకుడు రాంమాధవ్ పై తెలంగాణ బీజేపీ నేతలు భారీ ఆశలే పెట్టుకున్నారు. ఆయనది లక్కీ హ్యాండ్ అన్న భావన ఉండడంతో తెలంగాణ ఎన్నికల ఇంచార్జ్ గా ఆయన్నే పంపించాలని పార్టీ నేతలు ఎడతెగకుండా విజ్ఞప్తులు చేస్తున్నారు. రాంమాధవ్ వస్తే పార్టీ అధికారం దిశగా అడుగులు వేస్తుందన్న భావన తెలంగాణ బీజేపీ నేతల్లో వ్యక్తమవుతోంది. 

తెలంగాణపై కేంద్ర బీజేపీ పెద్దలు ప్రత్యేకంగా దృష్టి పెట్టినట్లు గత కొద్ది రోజులుగా పార్టీలో జోరుగానే చర్చ జరిగింది. అందుకు అనుగుణంగానే జాతీయపార్టీ అధినేత అమిత్ షా వరుస పర్యటనలు చేసి పార్టీలో హడావుడి చేశారు. అయితే ఏడాది కాలంగా వరుస ఎన్నికలతో తెలంగాణను కేంద్ర పెద్దలు పట్టించుకోవడం లేదన్న ఆందోళన పార్టీలో నెలకొంది. దీనికితోడు రాష్ట్రంలో అధికార పార్టీకి అనుకూలంగా కేంద్రప్రభుత్వం వ్యహరిరిస్తుందన్న ప్రచారం జరుగుతుండడంతో చాలా మంది నేతలు పార్టీ పై ఆశలు వదులుకున్నారు. అటు రాష్ర పార్టీ ముఖ్యనేతలెవ్వరూ టీఆర్ఎస్ పై ఘాటుగా స్పందించకపోవడం కూడా కార్యకర్తలను నిరుత్సాహ పరుస్తోందన్న వ్యాఖ్యానాలు వినిపిస్తున్నాయి. 

జాతీయ పార్టీకి లక్కీ హ్యాండ్ గా పేరున్న ప్రధాన కార్యదర్శి రాంమాధవ్ ను తెలంగాణలోని ఐదు పార్లమెంటు నియోజకవర్గాలకు ఇంచార్జుగా నియమించారు. ఈ క్రమంలో రాంమాధవ్ కూడా కూడా ఇప్పటికే ఐదు పార్లమెంటు నియోజకవర్గాల్లో పరిస్థితిని అధ్యయనం చేశారు. పనిలోపనిగా అధికార టీఆర్ఎస్ కు ఘాటు ప్రశ్నలు సంధించి సవాలు కూడా చేశారు. తాజాగా ఆయన త్రిపుర ఎన్నికల ఇంచార్జుగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఆయన అక్కడ ఎన్నికల బాధ్యతలు పూర్తి చేసుకొని ఇకపై పూర్తి సమయాన్ని తెలంగాణకే కేటాయిస్తారన్న ఆశాభావం పార్టీలో వ్యక్తమవుతోంది. ఆయన వస్తే.. రాష్ట్ర పార్టీలో ఉన్న అసంతృప్తి సద్దుమణుగుతుందన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. 

రాంమాధవ్ ఇప్పటికే తెలంగాణలో ఐదు పార్లమెంటు నియోజివకర్గాలకు ఇంచార్జు కావడంతో పార్టీ పూర్తి బాధ్యతలు ఆయనకే అప్పగించాలని రాష్ట్ర బీజేపీ నేతలు జాతీయ పార్టీకి విజ్ఞప్తులు చేసినట్లు సమాచారం. అమిత్ షా తో త్వరలో జరిగే కీలక భేటీలో ఇదే అంశాన్ని మరోసారి ప్రస్తావించి మాధవ్ ను రప్పించేందుకు పార్టీ అధ్యక్షుడు లక్ష్మణ్ విశ్వప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. మాధవ్ కు తెలంగాణ రాజకీయాలపై, తెలంగాణ బీజేపీ నేతలపై పూర్తి పట్టు ఉండడంతో ఆయన్ను రంగంలో దించితే కాంగ్రెస్ ను దెబ్బతీయడం సులభమని లక్ష్మణ్ భావిస్తున్నట్లు సమాచారం. మరి లక్ష్మణ్ కోరిక నెరవేరుతుందా.. బీజేపీ గట్టి పోటీ ఇచ్చే అవకాశాలను ఆ పార్టీ కేంద్ర నాయకత్వం పరిశీలిస్తుందా.. అనేది చూడాలి.

English Title
Telangana bjp want Ram Madhav has incharge

MORE FROM AUTHOR

RELATED ARTICLES