నేడు తెలంగాణ ఎన్నికల షెడ్యూల్ విడుదల

x
Highlights

తెలంగాణ‌లో ఎన్నికల ప్ర‌క్రియ ఇవాళ్టి నుంచి అధికారికంగా మొదలుకాబోతోంది. ఈ మేరకు ఎన్నికల కమిషన్‌ నేడు నోటిఫికేషన్‌ ఇవ్వనుంది. దీంతో ఇవాళ్టి నుంచే...

తెలంగాణ‌లో ఎన్నికల ప్ర‌క్రియ ఇవాళ్టి నుంచి అధికారికంగా మొదలుకాబోతోంది. ఈ మేరకు ఎన్నికల కమిషన్‌ నేడు నోటిఫికేషన్‌ ఇవ్వనుంది. దీంతో ఇవాళ్టి నుంచే నామినేషన్ల పర్వం ప్రారంభం కానుంది. దీనికోసం అధికారులు ఇప్పటికే అన్ని ఏర్పాట్లూ పూర్తి చేశారు. తెలంగాణ అసెంబ్లీ రద్దైన నాటి నుంచి రాష్ట్రంలో ఎన్నిక‌ల హ‌డావుడి ప్రారంభ‌మైంది. ఇప్పటికే ఎన్నికలకు కవాల్సిన సమాగ్రి తెలంగాణకు చేరింది వివిధ పార్టీలకు చెందిన అభ్యర్థులు ప్రాచారం ప్రారంభించారు ఇక ఇవాళ ఎలక్షన్ నోటిఫికేషన్ విడుదల చేసేందుకు రాష్ట్ర ఎలక్ట్రరోల్ అధికారి రజత్ కుమార్ సిద్ధమయ్యారు. నోటిఫికేషన్ విడుదల చేసిన తరువాత ఇక శాసనసభ సభ్యులుగా పోటికి దిగే వారు తమ తమ నియోజకవర్గంలో నామినేషన్ల సమర్పించనున్నారు.

ఇవాళ్టి నుంచి ఈ నెల 19 వరకు నామినేషన్లు వేసే అవకాశం ఉంది. ఇక ఈ నెల 20న స్క్రూటినీ, 22 వరకు నామినేషన్ల ఉపసంహరణకు ఎన్నికల కమిషన్‌ గడువు విధించింది. వచ్చే నెల 7న తెలంగాణలోని 119 స్థానాలకు ఎన్నికలు నిర్వహించనుంది. డిసెంబర్ 11 న ఫలితాలు వెల్లడించనున్నారు. దీనికోసం ఈసీ అన్ని ఏర్పాట్లు పూర్తిచేసింది.

ఇక ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌కోసం ఇప్పటికే కేంద్ర బల‌గాలు రాష్ట్రానికి చేరుకున్నాయి. రాష్ట్రంలో 13 నియోజకవ‌ర్గాల్లో న‌క్స‌ల్స్ ప్ర‌భావం ఉండొచ్చని అంచనా వేసిన ఈసీ అక్కడ అదనపు భద్రతా ఏర్పాట్లు చేసింది. ఎన్నిక‌ల సంద‌ర్భంగా మ‌ద్యం, న‌గ‌దు ప్ర‌వాహం అడ్డుకునేందుకు ప‌టిష్ట చ‌ర్య‌లు చేప‌ట్టింది. రాష్ట్ర వ్యాప్తంగా చెక్ పోస్టులు, కంట్రోల్ రూంల‌ను ఏర్పాటు చేసి పోలీస్ బల‌గాల‌ను మోహ‌రించింది. పొరుగు రాష్ట్రాల స‌రిహ‌ద్దుల వ‌ద్ద ఆయా రాష్ట్రాల‌తో క‌లిసి నిఘా క‌ట్టుదిట్టం చేసారు. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా పలు చక్ పోస్టుల్లో భారీగా నగదు మధ్యం స్వాధీనం చేసుకున్నారు. ఇవాళ నోటిఫికేష‌న్ రానున్న నేపథ్యంలో అభ్యర్థులు, పార్టీల నేత‌ల‌పై నిఘాను క‌ట్టుదిట్టం చేయాల‌ని నిర్ణ‌యించారు ఎన్నికల అధికారులు.

పోలింగ్ రోజు పోలింగ్ బూత్ ల వ‌ద్ద ఇబ్బందులు త‌లెత్త‌కుండా జాగ్ర‌త్త‌లు తీసుకుంది ఎన్నిక‌ల క‌మిష‌న్. రాష్ట్రంలో 32వేల574 పోలింగ్ బూత్ లు ఏర్పాటు చేయనున్నారు దీనికి అధనంగా మరో 210 పోలింగ్ బూతులు కావాలని కేంద్రాన్ని అనుమతి కోరింది రాష్ట్ర ఎన్నికల సంఘం ఇక ఎన్నికల నేపథ్యంలో 52వేల100 ఈవీఎంలు, 44వేల వీవీ ప్యాట్సలు, 41 వేల బ్యాలేట్ యూనిట్లను అధికారులు సిద్ధం చేశారు ఈవీఎంలలో స‌మ‌స్య‌లు తలెత్త‌కుండా జాగ్ర‌త్త‌లు తీసుకున్న అధికారులు రాష్ట్రంలో 30 శాతం అద‌న‌పు ఈవీఎంల‌ను సిద్ధంగా ఉంచారు.

రాష్ట్రంలో ప్రస్తుతం 2 కోట్ల 61 లక్షల మంది ఓటర్లు ఉన్నట్లు ఈసి తెలిపింది. అయితే అక్టోబర్ 1తర్వాత వచ్చిన ధరఖాస్తులను జత చేసి కొత్త ఓటర్ లిస్టును ఈనెల 19 విడుదల చేయనున్నట్లు అధికారులు తెలిపారు మొత్తానికి ఇప్పటికే ప్రచారం ప్రారంభించిన నేతలు నోటిఫికేషన్ కూడా విడుదల అవుతున్న నేపథ్యంలో వారి ప్రచారాన్ని మరింత ముమ్మరం చేయనున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories