తెలంగాణ ఎన్నికలతో మద్యం షాపులకు బ్రేక్..

తెలంగాణ ఎన్నికలతో మద్యం షాపులకు బ్రేక్..
x
Highlights

తెలంగాణ ఎన్నికలతో మద్యం అమ్మకాలకు ఎలక్షన్ కమిషన్ బ్రేక్ వేసింది. 5వ తేదీ సాయంత్రం నుండి ఏడవ తేదీ వరకు 48 గంటలు మద్యం దుకాణాలతో పాటు బార్లు, క్లబ్ లు...

తెలంగాణ ఎన్నికలతో మద్యం అమ్మకాలకు ఎలక్షన్ కమిషన్ బ్రేక్ వేసింది. 5వ తేదీ సాయంత్రం నుండి ఏడవ తేదీ వరకు 48 గంటలు మద్యం దుకాణాలతో పాటు బార్లు, క్లబ్ లు మూసివేయాలని ఈసీ ఆదేశించింది. మద్యం అమ్మకాలపై పోలీస్, ఎక్సైజ్ శాఖ ఫోకస్ పెట్టాలని ఈసి కోరింది. ఎన్నికల వేళ మద్యం దుకాణాలు మూతపడుతున్నాయి. ఏడవ తేదీన జరిగే పోలింగ్ దృష్ట్యా 48 గంటలు మద్యం అమ్మకాలు నిలిపివేసింది ఈసీ, ఎక్సైజ్ శాఖ. డిసెంబర్ 5వ తేదీ సాయంత్రం 6 గంటల నుంచి 7వ తేదీ సాయంత్రం 6 గంటల వరకు మద్యం దుకాణాలన్నీ మూసి వేయాలని హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారి దాన కిశోర్ ఆదేశాలు జారీ చేశారు.

మద్యం దుకాణాలతో పాటు అన్ని బార్లు, రెస్టారెంట్లు, పబ్ లు , స్టార్ హోటళల్లోని బార్లు, రిజిస్టర్ క్లబ్ లు మూసివేయాలని ఆదేశించారు. పోలింగ్ కేంద్రాల వద్ద నలుగురి కన్నా ఎక్కువ మంది గుమిగూడి ఉండరాదని పోలీస్ కమిషనర్ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఎన్నికల వేళ మద్యం, డబ్బులతో ఓటర్లను ప్రలోభాలకు గురిచేసే అవకాశం ఉండటంతో అప్రమత్తంగా ఉండాలని ఈసీ పోలీసు శాఖకు ఆదేశాలిచ్చింది.

మద్యం నియంత్రణకు పోలీసులతో పాటు ఎక్సైజ్ శాఖ తోడ్పడాలని ఈసి కోరింది. రంగంలోకి దిగిన ఎక్సైజ్ శాఖ అధికారులు మద్యం షాపులు, బెల్ట్ షాపులు, డిపోలు, బ్యావరేజీ కంపెనీలపై నిఘా పెట్టారు. మద్యం అమ్మకాలపై స్పష్టమైన లెక్కలు ... ఇన్వాయిస్ సమర్పించాల్సి ఉంటుంది. అక్రమ మద్యం సరఫరాపై సమాచారం ఇచ్చేందుకు టోల్ ఫ్రీ నంబర్ 18004252523 ను ఏర్పాటు చేశారు. ఇతర రాష్ట్రాల నుండి పెద్ద మొత్తం లో సరుకు దిగుమతి చేసుకొని శివారు ప్రాంతాల్లో గుట్టుగా దాచిపెట్టినట్టు తెలుస్తోంది.. వాటి పై ప్రత్యేక నిఘా పెట్టి ఎన్నికలు ప్రశాంత వాతావరణం లో జరిగేలా హోంగార్డ్ నుండి డీజీ స్థాయి అధికారి వరకు అప్రమత్తంగా ఉండాలని ఆదేశాలు ఇచ్చారు డీజీపీ.

Show Full Article
Print Article
Next Story
More Stories