గంట ఆలస్యంగా పోలింగ్‌

Submitted by nanireddy on Fri, 12/07/2018 - 08:51
telangana-assembly-elections-2018

తెలంగాణలో ఓటింగ్ ప్రశాంతంగా జరుగుతోంది. అయితే పలు చోట్ల పోలింగ్‌ కేంద్రాల్లో ఈవీఎంలు ఉన్న చోట లైటింగ్‌ సరిగా లేదని.. పార్టీల గుర్తులు సరిగా కనబడటంలేదని ఓటర్లు ఆందోళన చేస్తున్నారు. అలాగే పలు చోట్ల ఈవీఎంలు మొరాయిస్తున్నాయి. గవర్నర్‌ నరసింహన్‌ వేస్తున్న సోమాజిగూడ రాజ్‌నగర్‌ అంగన్‌వాడి పోలింగ్‌ కేంద్రంలో కూడా ఈవీఎంలు మొరాయిస్తున్నాయి. కిషన్‌ రెడ్డి, అయన కుటుంబ సభ్యులు కాచిగూడలో ఓటు వేశారు. కామారెడ్డిలోని మద్నూర్‌ పోలింగ్‌ కేంద్రంలో ఈవీఎంలు మొరాయించడంతో పోలింగ్‌ గంట ఆలస్యంగా ప్రారంభమైంది. 

English Title
telangana-assembly-elections-2018

MORE FROM AUTHOR

RELATED ARTICLES