సీటుకోసం కోటి తిప్పలు.. నరాలు తెగే ఉత్కంఠ పోరులో విజయం ఎవరిని వరిస్తుందో..??

సీటుకోసం కోటి తిప్పలు.. నరాలు తెగే ఉత్కంఠ పోరులో విజయం ఎవరిని వరిస్తుందో..??
x
Highlights

ఎన్నికల ప్రచారంలో అన్ని పార్టీలు దూసుకుపోతున్నాయి. ఇంకా వారం రోజుల సమయమే ఉందీ. దీంతో ప్రచారానికి సమయం ఉండటంతో అన్ని బలగాలు మోహరిస్తున్నారు పార్టీల...

ఎన్నికల ప్రచారంలో అన్ని పార్టీలు దూసుకుపోతున్నాయి. ఇంకా వారం రోజుల సమయమే ఉందీ. దీంతో ప్రచారానికి సమయం ఉండటంతో అన్ని బలగాలు మోహరిస్తున్నారు పార్టీల అభ్యర్దులు. రెండు నెలల ముందే ప్రచారంలోనికి దిగిన గులాభి పార్టీ ఇప్పటి పలు దఫాలుగా గ్రామాలు పట్టణాలు చుట్టి వచ్చారు. దీంతో ఇప్పుడు మహాకూటమి ప్రధాన నాయకులను టార్గెట్ చేసి వారికి ఊపిరి సలుపకుండా చేస్తున్నారు. కాంగ్రెస్ హేమాహేమి నాయకులే వారి నియోజక వర్గం దాటి పక్క నియోజక వర్గంలో ప్రచారం చేయకుడా అష్టదిగ్భందనం చేస్తున్నారు గులాభీ శ్రేణులు.

టీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్‌, మొదటి నుంచి, ప్రత్యర్థుల ఎత్తులపైఎత్తుల బట్టి, అడుగులేస్తున్నారు. మహాకూటమిలో కాంగ్రెస్, టీ టీడీపీ, సీపీఐ, తెలంగాణ జనసమితి చేరే వరకు వేచి చూశారు. అక్కడ అభ్యర్దుల లిస్టు ఫైనల్ కాగానే స్వయంగా ప్రచారబరిలోకి దూకారు. 19 తేదీ నుంచి రోజూ సరాసరి ఐదు నుంచి ఎనిమిది సభల్లో ప్రసంగిస్తున్నారు. జాతీయ పార్టీల నేతలు బీజేపీ నుంచి మోడీ అమిత్ షా, సుస్మాస్వరాజ్, రాజనాథ్ సింగ్‌లు, ఇటు కాంగ్రెస్ నుంచి ఏఐసిసి అధ్యక్షులు రాహుల్ గాంధీ, సోనియాగాంధీలు, బీఎస్పీ అధినేత్రి మాయావతి, టీడీపీ అధ్యక్షులు చంద్రబాబు, తెలంగాణ ప్రచారాన్ని హోరెత్తించారు. అయినా గులాబీ శ్రేణులకు ధైర్యం తగ్గకుండా పార్టీ బలగాలను రంగంలోనికి దించారు కేసీఆర్. ఓవైపు ఎంపీలు, సీనియర్ మంత్రులు, ఎమ్మెల్యీలకు ప్రధాన నియోజక వర్గాల బాధ్యతలు అప్పగించి, అష్టదిగ్భంధన వ్యూహం అమలు చేస్తున్నారు.

ఇటు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో మంత్రి కేటీఆర్ రోడ్ షోలతో నగరాన్ని చుట్టేస్తున్నారు. అంతటితో ఆగకుండా కొన్ని నియోజక వర్గాల్లో మంత్రులు హరీష్ రావు, కేటీఆర్ ప్రచారం చేసి వస్తున్నారు. అయితే గులాబీ బాస్‌ ప్రధాన గురి, కాంగ్రెస్‌ సీనియర్‌ నేతలపై పడింది. కాంగ్రెస్‌లో సీఎం అభ్యర్దులుగా పోటీ పడుతున్న జానారెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, మల్లు భట్టి విక్రమార్క, రేవంత్ రెడ్డి, దామోదర రాజనర్శింహ, కోమటిరెడ్డి సోదరులు, డీకే అరుణలను టార్గెట్ చేశారు కేసీఆర్. గులాబీదళంతో వారిని చుట్టముట్టారు. వారు అక్కడి నుంచి పక్కకు వెళ్లి, ఇతర నియోజకవర్గాల్లో ప్రచారం చేయకుండా కట్టడి చేస్తున్నారు.

కేవలం విజయశాంతి, రేవంత్ రెడ్డిలు మాత్రమే ప్రతిరోజూ కొన్ని నియోజకవర్గాల్లో తిరిగి ప్రచారం చేస్తున్నారు. రేవంత్ రెడ్డి రాత్రికి కొడంగల్ చేరుకుని ప్రచారం చేసుకుంటున్నారు. మల్లు భట్టి విక్రమార్క కొన్ని సభలు ప్రచారం చేసి, ప్రస్తుతం పూర్తిగా మధిరకే పరమితమయ్యారు. ఇటు సీనియర్ నేత జానారెడ్డి నాగార్జున సాగర్ నియోజకవర్గం దాటి వెళ్లలేని పరిస్థితి నెలకొంది. కోమటి రెడ్డి సోదరులకు అదే పరిస్థితి. డీకే అరుణ గద్వాల్ దాటి రావడం లేదు. అక్కడి నియోజకవర్గాల్లో పలువురు ఎమ్మెల్సీలు, ఎంపీలు ప్రచారం చేస్తూ కాంగ్రెస్ నేతలను దిగ్భందనం చేస్తున్నారు. ఇలా చుట్టుమట్టడంలో మరో వ్యూహం, కాంగ్రెస్ సీనియర్ల స్థైర్యం దెబ్బతీయాలనే అంటున్నారు కారు పార్టీ నేతలంటున్నారు. ఈ ప్లాన్‌ను రానున్న ఐదారు రోజుల్లో మరింత టైట్ చేస్తామని చెబుతున్నారు.

వారివారి నియోజకవర్గాల్లో ప్రచారం చేసుకోవడానికే సమయం ఇచ్చి, ఇతర నియోజక వర్గాల్లో అడుగుపెట్టడానికి కూడా టైమ్ లేకుండా చెయ్యాలన్న వ్యూహం కేసీఆర్‌ది. అంటే వారు గెలుస్తామనే సీట్లు కనీస స్థాయికి తగ్గించే ప్లాన్‌లో ఉన్నారు గులాబీ బాస్. అంటే వారివారి స్థానాల్లో, వారి గెలుపే కష్టం అనే భావన కలిగించే వ్యూహంతోనే, ఈ అష్టదిగ్భందనం ప్లాన్ అమలు చేస్తున్నామని టీఆర్ఎస్‌ నేతలు చర్చించుకుంటున్నారు. మొత్తానికి కాంగ్రెస్ సీనియర్‌ నేతలను కార్నర్ చేస్తే, వారి కార్యకర్తలను కన్యూఫ్యూజన్‌లోకి నెట్టి, చాలా నియోజకవర్గాల్లో సునాయాసంగా విజయం సాధించాలనే వ్యూహం టీఆర్ఎస్‌ది. ఇప్పటికే ఈ స్ట్రాటజీతో సక్సెస్‌ అవుతున్నామని భావిస్తున్నారు టీఆర్ఎస్ నేతలు. అయితే, తమలెక్కలు తమకున్నాయని చెబుతోంది కాంగ్రెస్. చూడాలి, ఇద్దరి వ్యూహాల్లో ఎవరి వ్యూహం ఎలాంటి ఫలితాలనిస్తుందో.

Show Full Article
Print Article
Next Story
More Stories