అన్నలు వద్దట.. తమ్ముళ్లకే పట్టం కట్టిన ప్రజలు

అన్నలు వద్దట.. తమ్ముళ్లకే పట్టం కట్టిన ప్రజలు
x
Highlights

తెలంగాణ ఎన్నికల్లో ఒకే కుటుంబం నుంచి ఎంతమంది పోటీ చేసినా గెలుపు మాత్రం ఒకరికే కట్టబెడతామంటున్నారు తెలంగాణ ప్రజలు. ఒక్క కేసిఆర్ కుటుంబానికి మాత్రం ఈ...

తెలంగాణ ఎన్నికల్లో ఒకే కుటుంబం నుంచి ఎంతమంది పోటీ చేసినా గెలుపు మాత్రం ఒకరికే కట్టబెడతామంటున్నారు తెలంగాణ ప్రజలు. ఒక్క కేసిఆర్ కుటుంబానికి మాత్రం ఈ రూల్ నుంచి మినహాయింపు ఉందని తేల్చారు. కేసీఆర్ ఆయన కుటుంబ సభ్యులకు బ్రహ్మరథం పట్టిన ఓటర్లు మిగిలిన నేతలకు మాత్రం గెలుపు ఒకరికేనని తేల్చి చెప్పారు. ఈ ఎన్నికల్లో ముగ్గురు అన్నదమ్ముల జంటలు పోటీ చేయగా అన్నలందరినీ ఓడించి తమ్ముళ్లను మాత్రం గెలిపించారు ఓటర్లు.

తెలంగాణ ఎన్నికలలో చిత్ర విచిత్రాలు జరిగాయి ఈ ఎన్నికల్లో పాల్గొన్న సోదరుల్లో ఒకరినే గెలిపించి తెలంగాణ ఓటర్లు చిత్రమైన తీర్పు నిచ్చారు ప్రధాన పార్టీల నుంచి అన్నదమ్ములు పోటీ చేయగా వారిలో ఒకరినే గెలిపించి మరొకరిని ఓడించారు.. టీఆరెస్ కు చెందిన పట్నం మహేందర్ రెడ్డి, పట్నం నరేందర్ రెడ్డి సోదరుల్లో కేవలం నరేందర్ రెడ్డిని మాత్రమే ప్రజలు గెలిపించారు. కొడంగల్ లో కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డికి ప్రత్యర్ధిగా నిలిచిన పట్నం నరేందర్ రెడ్డి1,980 ఓట్ల మెజారిటీతో గెలిచారు. ఇక నరేందర్ రెడ్డి సోదరుడు పట్నం మహేందర్ రెడ్డి తాండూరు టీఆరెస్ అభ్యర్ధిగా బరిలో నిలవగా కాంగ్రెస్ అభ్యర్ధి పైలెట్ రోహిత్ రెడ్డి ఆయనపై విజయం సాధించారు. అలాగే మల్లు బ్రదర్స్ విషయంలో కూడా అంతే టిపిసిసి నేత మల్లు భట్టి విక్రమార్క మధిర నుంచి పోటీ చేయగా ఆయన సోదరుడు మల్లు రవి జడ్చర్ల నుంచి కాంగ్రెస్ అభ్యర్ధులుగా బరిలో నిలిచారు. అయితే భట్టి విక్రమార్క హోరా హోరీ పోటీలో టిఆరెస్ అభ్యర్ధి లింగాల కమల్ రాజ్ పై విజయం సాధించారు.ఇక జడ్చర్ల నుంచి పోటీలో ఉన్న మల్లు రవిపై టీఆరెస్ అభ్యర్ధి సీ.హెచ్ లక్ష్మా రెడ్డి గెలిచారు.

ఇలాంటిదే మరో సంఘటన కోమటిరెడ్డి బ్రదర్స్ ఇద్దరూ పోటీలో నిలవగా వారిలో ఒక్కరే అసెంబ్లీకి ఎన్నికయ్యారు. నల్లగొండనుంచి బరిలో నిలిచిన కాంగ్రెస్ నేత కోమటిరెడ్డి వెంకట రెడ్డిపై టీఆరెస్ అభ్యర్ధి కంచర్ల భూపాల్ రెడ్డి విజయం సాధించారు... కోమటిరెడ్డి సోదరుడు రాజగోపాల్ మునుగోడు నుంచి తన ప్రత్యర్ధి టీఆరెస్ అభ్యర్ధి కె. ప్రభాకర్ రెడ్డిపై 22 వేల పై చిలుకు మెజారిటీతో విజయం సాధిచారు. మొత్తం మీద ఈ ఎన్నికల్లో అన్నలందరూ ఓడిపోగా తమ్ముళ్లు మాత్రం గెలిచి సత్తా చాటారు. ఇలాంటిదే మరో ఇంట్రెస్టింగ్ అంశం.. పిసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఆయన భార్య పద్మావతి ఇద్దరూ కాంగ్రెస్ అభ్యర్ధులుగా పోటీలో నిలవగా హుజూర్ నగర్ లో టీఆరెస్ అభ్యర్ధి ఎన్నారై శానంపూడి సైదిరెడ్డిపై విజయం సాధించారు. ఇక కోదాడ నుంచి కాంగ్రెస్ అభ్యర్ధిగా బరిలో ఉన్న ఉత్తమ్ భార్య పద్మావతి టీఆరెస్ అభ్యర్ధి బొల్లం మల్లయ్య యాదవ్ చేతిలో ఓటమి పాలయ్యారు. ఒక్క కేసిఆర్ కుటుంబాన్ని మినహాయిస్తే మిగతా వారందరికీ ఫ్యామిలీ నుంచి ఒకరికే గెలుపు ఛాన్స్ అని తేల్చి చెప్పారు ఓటర్లు.

Show Full Article
Print Article
Next Story
More Stories