విడాకులపై వెనక్కి తగ్గిన తేజ్..

Submitted by nanireddy on Thu, 11/29/2018 - 18:29
tej-pratap-yadav-withdrawn-divorce-petition

కుటుంబసభ్యుల ఒత్తిడితోనో, లేక ఇతర కారణాలతోనో బీహార్ మాజీ మంత్రి తేజ్ ప్రతాప్ యాదవ్ విడాకుల విషయంలో వెనక్కితగ్గినట్టు వార్తలు వస్తున్నాయి. తన విడాకుల నిర్ణయానికి ఆమోదం ఒకే చెబితేనే ఇంటికి వస్తానంటూ కొన్ని రోజుల క్రితం ఇంటి నుంచి వెళ్లిపోయిన తేజ్‌ ప్రతాప్‌.. తాజాగా తన విడాకుల పిటిషన్‌ని ఉపసంహరించుకున్నట్లు సమాచారం. అయితే ఈ విషయాన్నీ అధికారికంగా చెప్పలేదు. పరిస్థితులు చూస్తుంటే తేజ్, ఐశ్వర్య దంపతుల మధ్య వివాదాలకు పరిష్కారం దొరికినట్టుగా భావిస్తున్నారు. మరోవైపు జైల్లో శిక్ష అనుభవిస్తూ ఇటీవల అనారోగ్యం పాలైన లాలూ ప్రసాద్ యాదవ్.. కుమారుడి విషయంలో చాలా బాధపడుతున్నారని అందువల్ల తండ్రిని ఇబ్బంది పెట్టడం ఇష్టంలేకే తేజ్ ఈ నిర్ణయం తీసుకుని ఉండొచ్చని చర్చించుకుంటున్నారు. కాగా ఈ ఏడాది మే 12న తేజ్‌ ప్రతాప్‌, ఐశ్వర్యా రాయ్‌ల వివాహం అత్యంత ఆర్భాటంగా జరిగిన సంగతి తెలిసిందే.

English Title
tej-pratap-yadav-withdrawn-divorce-petition

MORE FROM AUTHOR

RELATED ARTICLES