టీడీపీ అవినీతి ఇప్పుడు గుర్తుకు వ‌చ్చిందా ప‌వ‌న్

Submitted by lakshman on Thu, 03/15/2018 - 00:39
 senior leader Babu Rajendra Prasad

ఎన్న‌డూ లేని విధంగా టీడీపీ పై ప‌వ‌న్ క‌ల్యాణ్ చేసిన వ్యాఖ్య‌లు సంచ‌ల‌నం సృష్టిస్తున్నాయి. గ‌త ఎన్నిక‌ల్లో టీడీపీకి మ‌ద్ద‌తిచ్చిన ప‌వ‌న్ పార్టీ ఆవిర్భావ‌స‌భ‌లో మాట్లాడిన తీరును చూస్తుంటే ...ఇప్ప‌టి వ‌ర‌కు ఓ లెక్క ఇప్ప‌టి నుంచి ఓ లెక్క అన్నచందంగా ఉన్న‌ట్లు పొలిటిక‌ల్ వ‌ర్గాలు విశ్లేషిస్తున్నాయి. ఏపీకి ప్ర‌త్యేక‌హోదా కోసం సాధించేదిశ‌గా అడుగులు వేస్తున్న ప‌వ‌న్ టీడీపీ అవినీతి  - అక్ర‌మాల చిట్టాను బ‌ట్ట‌బ‌య‌లు చేశాడు. 
చంద్ర‌బాబు ఢిల్లీ వెళ్లిన ప్ర‌తీసారి పీఎం మోడీ ఎందుకు అపాయిట్మెంట్ ఇవ్వ‌డంలేదో త‌నవద్ద స‌మాధానం ఉన్న‌ట్లు తెలిపారు. సీఎం చంద్ర‌బాబు ఓటుకు నోటు కేసు . నారాలోకేష్ శేఖ‌ర్ రెడ్డితో సంబంధాలు ఉండ‌డంతో మోడీ చంద్ర‌బాబుతో మాట్లాడేందుకు విముఖ‌త వ్య‌క్తం చేస్తున్న‌ట్లు త‌మ‌కు స‌మాచారం అందించ‌ద‌ని సూచించారు.  
టీడీపీ నేత‌లు రాష్ట్రాన్ని అవినీతి ఆంధ్రాగా మార్చార‌ని దుయ్య‌బ‌ట్టారు. ఇసుక మాఫీయా ప్రొత్స‌హించేలా టీడీపీ ఎమ్మెల్యేల‌కు చంద్ర‌బాబు మ‌ద్ద‌తు ప‌ల‌క‌డం ఎంత‌వ‌ర‌కు స‌మంజ‌సం అని అన్నారు. ఇసుకు ఫ్రీ అని చెప్పే ప్ర‌భుత్వ లారీ ట్ర‌క్కుకు రూ.15వేలు ఎందుకు వ‌సూలు చేస్తుందో చెప్పాల‌ని డిమాండ్న చేశారు. దీనికి తోడు ఎమ్మార్వో వ‌న‌జాక్షిపై దాడికి చేయ‌డం స‌రైన ప‌ద్ద‌తేనా అని అన్నారు. 
అయితే ఈ వ్యాఖ్య‌లు టీడీపీ నేత‌ల‌కు మింగుడు ప‌డ‌లేదు. ప‌వ‌న్ జెంటిల్ మెన్ సామాజిక స్పృహ ఎక్కువ .కాబ‌ట్టే ప‌వ‌న్ క‌ల్యాణ్ కు పార్టీ నేత‌లు స‌ముచిత స్థానాన్ని క‌ల్పించార‌ని అన్నారు. అలాంటి ప‌వ‌న్ ఈ రోజు పార్టీ నేత‌ల‌పై విమ‌ర్శ‌లు చేయ‌డం త‌గ‌ద‌ని అన్నారు. 
నాలుగేళ్ల నుంచి ఈ విషయం పవన్ కల్యాణ్ గారికి తెలియదా? మాతోనే ఆయన కలిసి తిరిగారుగా? చంద్రబాబుగారికి నలభై ఏళ్ల సుదీర్ఘ రాజకీయ చరిత్ర. మచ్చలేని రాజకీయ జీవితాన్ని చంద్రబాబు గడుపుతున్నారు. లక్ష కోట్లు దోచేసిన దొంగల కంటే చంద్రబాబు చాలా బెటరని భావించడం వల్లేగా పవన్ కల్యాణ్ నాడు మాకు సపోర్ట్ చేసి ముందుకు తీసుకెళ్లింది? మరి, ఈరోజున ఇలా మాట్లాడటమేంటి? పవన్ కల్యాణ్ మాట్లాడిన తీరు చూస్తే.. అది  ఆయన మాట్లాడినట్టుగా అనిపించడం లేదు. 

English Title
TDP's spokesperson and senior leader Babu Rajendra Prasad has condemned Pawan's allegations

MORE FROM AUTHOR

RELATED ARTICLES