టీడీపీ ఎంపీలకు తలంటిన స్పీకర్‌

Submitted by arun on Thu, 02/08/2018 - 12:26
Lok Sabha

లోక్‌సభ స్పీకర్‌ సుమిత్రామహాజన్‌ తెలుగుదేశం సభ్యులకు తలంటింది. టీడీపీల నినాదాలు అభ్యంతరకంగా ఉన్నాయన్న స్పీకర్‌... ఇలా నినదిస్తూ ఇతర సభ్యులను ఇబ్బందులకు గురిచేయవద్దని మందలించింది. వెనక్కి వెళ్లి.. ఎవరి సీట్లో వారు కూర్చోవాలని సూచించినా... టీడీపీ సభ్యులు పట్టించుకోలేదు. సీట్లో కూర్చునేందుకు ససేమిరా అన్నారు. ఇలా అయితే చర్యలు తప్పవంటూ స్పీకర్‌ కాస్త ఘాటుగా హెచ్చరించారు. చిత్తూరు ఎంపీ శివప్రసాద్‌ తప్పెటగూళ్ల వేషధారణలో కంజరతో సభలోని వచ్చి దాన్ని వాయించేందుకు ప్రయత్నించడం గందరగోళానికి దారితీసింది. పార్లమెంటు సిబ్బంది ఆయన్ని వారించి బయటకు పంపేశారు.

TDP MPs protesting in Lok Sabha

English Title
TDP, YSR Congress MPs demand 'justice' for Andhra as Lok Sabha

MORE FROM AUTHOR

RELATED ARTICLES