ఎపీకి అన్యాయం జరిగిందని చంద్రబాబు ఆవేదన

Submitted by arun on Mon, 02/05/2018 - 10:48
tdp

కేంద్ర బడ్జెట్‌లో ఏపీకి జరిగిన అన్యాయంపై పోరాటం చేయాలని టీడీపీ పార్లమెంటరీ పార్టీ నిర్ణయించింది. కేంద్రంపై వీలైనంత ఒత్తిడి తేవాలని ఎంపీలకు ముఖ్యమంత్రి ఆదేశాలు ఇచ్చారు. అవసరాన్ని బట్టి కేంద్ర మంత్రులను కలవాలని ఎంపీల కు సీఎం చంద్రబాబు సూచించారు.

బడ్జెట్‌లో కేటాయింపులపై పార్లమెంట్‌లో పోరాడాలని తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ నిర్ణయించింది. చంద్రబాబు అధ్యక్షతన జరిగిన సమావేశంలో బడ్జెట్‌లో ఏపీకి జరిగిన అన్యాయంపై చంద్రబాబు చర్చించారు. కేంద్ర బడ్జెట్ తర్వాత ఆవేశంతో ఊగిపోయిన టీడీపీ పార్లమెంట్ పార్టీ భేటీలో ఎలాంటి నిర్ణయాలు తీసుకోలేకపోయింది. కేంద్ర బడ్జెట్‌లో ఏపీకి అన్యాయం జరిగిందని సాధారణంగా ఎప్పుడు చెప్పే మాటలు చెప్పారు సీఎం చంద్రబాబు. ఏపీకి జరిగిన అన్యాయం గురించి కేంద్రంపై ఒత్తిడి తేవాలని అవసరమైతే పార్లమెంట్‌లో ప్లకార్డులను చూపించాలని సీఎం చూచించారు. గత నాలుగేళ్లుగా కేంద్రం నుంచి ఎలాంటి నిధుల విడుదల కాలేదన్నారు కేంద్ర మంత్రి సుజనా చౌదరి.  

ఇచ్చిన హామీలను త్వరగా నెరవేర్చేలా పోరాటం చేస్తామన్నారు. రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యమని పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు చెప్పారన్న ఆయన అవసరమైతే పార్లమెంట్‌లో నిరసన వ్యక్తం చేస్తామన్నారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చకపోతే తమ పార్టీ అధ్యక్షుడు ఏ నిర్ణయం తీసుకున్నా కట్టుబడి ఉంటామని కేంద్ర మంత్రి సుజనా చౌదరి స్పష్టం చేశారు.

పార్లమెంటరీ పార్టీ సమావేశం మధ్యలో సీఎం చంద్రబాబుకు కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ ఫోన్‌లో మాట్లాడారు. కేంద్రం ఇచ్చిన విభజన హామీలు నెరవేర్చాలని రాజ్‌నాథ్‌ను కోరారు చంద్రబాబు నాయుడు. అంతేకాకుండా 
కేంద్ర బడ్జెట్‌లో ఎపీకి అన్యాయం జరిగిందని సీఎం ఆవేదన వ్యక్తం చేసినట్లు సమాచారం. కేంద్రం నుంచి సహాయసహకారాలు ఉంటాయని రాజ్‌నాథ్‌ సింగ్‌ చంద్రబాబుకు చెప్పినట్లు తెలుస్తోంది. 
 

English Title
TDP not pulling out but will put pressure on Centre for funds

MORE FROM AUTHOR

RELATED ARTICLES