‘మోదీ బావా’...అంటూ ఎంపీ శివప్రసాద్ నిరసన

Submitted by arun on Fri, 08/10/2018 - 12:53

రోజుకో గెటప్‌‌లో పార్లమెంట్‌కు వస్తోన్న టీడీపీ ఎంపీ శివప్రసాద్‌ ఈరోజు విచిత్ర వేషధారణతో వచ్చారు. దాంతో పార్లమెంట్‌ ఆవరణలో శివప్రసాద్‌ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. శివప్రసాద్‌ వేషధారణను చూసిన సోనియాగాంధీ సైతం ఒక్కసారి ఆగి పలకరించారు. సోనియా పలకరింపుతో అవాక్కైన శివప్రసాద్‌ ప్రతి నమస్కారం చేశారు. ఏపీకి న్యాయం చేయాలంటూ థర్డ్ జెండర్ ప్రతినిధిగా ఎంపీ శివప్రసాద్ పార్లమెంటులో నిరసన తెలిపారు. ‘మోడీ బావా... ప్రత్యేక హోదా... ఇవ్వకుంటే.... నీ అంతం ఆరంభం అంటూ’ ఎంపీ హాస్య గీతం ఆలపించారు. ‘మాటలెన్నో చెప్పావు చేతల్లో ఏమీ చూపలేదు అంటూ’ ప్రధాని మోదీపై ఎంపీ శివప్రసాద్ చలోక్తులు విసిరారు.
 

English Title
TDP MP Siva Prasad Gay Getup

MORE FROM AUTHOR

RELATED ARTICLES