మేం కరుడుగట్టిన టీడీపీ వాదులం.. మేం మీకు లొంగం

Submitted by arun on Fri, 10/12/2018 - 11:48

కక్ష సాధింపులో భాగంగానే తనపై ఐటీ దాడులు చేస్తున్నారని ఆరోపించారు సీఎం రమేష్‌. ఐటీ దాడుల వెనక కేంద్ర ప్రభుత్వ హస్తం ఉందన్నారు. అన్ని చట్టపరిధిలోనే ఉన్నాయి.. తాము చట్టానికి వ్యతిరేకంగా పోలేదని సీఎం రమేష్‌ తెలిపారు. కడపలో ఉక్కు ఫ్యాక్టరీ కోసం పోరాడుతుంటే.. తనపై ఐటీ దాడులు చేస్తున్నారని ఆరోపించారు సీఎం రమేష్. తాము కరుడుగట్టిన టీడీపీ వాదులమని.. తమను ఎవరు లొంగదీసుకోలేరని చెప్పారు. రాష్ట్ర ప్రయోజనాలకు నష్టం జరుగుతుంటే చూస్తూ ఊరుకోమని సీఎం రమేష్ తెలిపారు. 

English Title
TDP MP CM Ramesh Responds on IT Raids

MORE FROM AUTHOR

RELATED ARTICLES