వార్డ్ మెంబర్ గా గెలవడం చేతకాని సోము వీర్రాజు: ఎమ్మెల్సీ బుద్దా

Submitted by arun on Mon, 02/05/2018 - 13:15
Buddha Venkanna

బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజుపై తెలుగుదేశం పార్టీకి చెందిన ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న విరుచుకుపడ్డారు. సోము వీర్రాజు కనీసం వార్డుమెంబర్‌గా కూడా గెలవలేదని, అయినా.. టీడీపీ అతన్ని ఎమ్మెల్సీని చేసిందని బుద్దా గుర్తు చేశారు. టీడీపీ అవినీతి పార్టీ అని విమర్శిస్తున్న వీర్రాజు... అవినీతి పార్టీ ఇచ్చిన ఎమ్మెల్సీ పదవి ఎందుకు తీసుకున్నారని ప్రశ్నించారు. వీర్రాజు వైసీపీకి అమ్ముడు పోయాడన్నారు. పార్టీ పేరుతో ఎంత వసూలు చేశారో మీ నేతలే చెబుతున్నారని, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడిపై విమర్శలు చేస్తే ఊరుకునేది లేదని బుద్దా వెంకన్న తీవ్రంగా హెచ్చరించారు. అలాగే సోము వీర్రాజు వ్యాఖ్యలపై బీజేపీ పెద్దలు స్పష్టత ఇవ్వాలన్నారు. జగన్‌ను సోము వీర్రాజు ఎందుకు విమర్శించడం లేదని, సోము వీర్రాజుది బీజేపీ అజెండానా? వైసీపీ అజెండానా? అని ఆయన అన్నారు.

English Title
TDP MLC Buddha Venkanna fire on bjp mlc somu veerraju

MORE FROM AUTHOR

RELATED ARTICLES