మరో వివాదంలోఎమ్మెల్యే చింతమనేని

Submitted by arun on Tue, 01/09/2018 - 18:01

పశ్చిమగోదావరి జిల్లా దెందులూరు ఎమ్మెల్యే, విప్ చింతమనేని ప్రభాకర్ మరోసారి వివాదంలో నిలిచారు. ఓ ప్రభుత్వ అధికారిపై చింతమనేని ఇష్టం వచ్చినట్టు నోరు పారేసుకున్న ఓ వీడియో.. సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. పెదవేగి మండలం విజయరాయిలో జరిగిన జన్మభూమి కార్యక్రమంలో పాల్గొన్న చింతమనేని.. వేదికపై మహిళా ప్రెసిడెంట్, ఎంపీటీసీలు ఉండగానే ఓ అధికారిని బండబూతులు తిట్టారు. ఆ వీడియో, ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

పెదవేగి మండలం విజయరాయిలో ఇటీవల జరిగిన జన్మభూమి కార్యక్రమంలో.. దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ పాల్గొన్నారు. అయితే, ఈ కార్యక్రమంలో కార్డ్‌లెస్ మైక్ ఎందుకు ఏర్పాటు చేయలేదంటూ పంచాయితీ సెక్రటరీపై చిందులేశారు. ఇంతలో మైక్ సెట్ ఏర్పాటు చేసిన వ్యక్తికి, పంచాయితీ సెక్రటకరీ ఫోన్ చేస్తుండగా.. ఇప్పుడు, ఎవడికి ఫోన్ చేస్తావురా.. అంటూ బూతులను లంకించుకున్నారు. పక్కనున్న మహిళా నేతలు సైతం సిగ్గుపడేలా.. అసభ్యకరమైన పదజాలంతో నోరుపారేసుకున్నారు.

అధికార పార్టీ ఎమ్మెల్యే, అందులోనూ విప్.. అంతటి నాయకుడు అలా నోటికొచ్చినట్లు తిడుతుంటే, ఏం మాట్లడాలో అర్ధంకాక.. పంచాయితీ సెక్రటరీ నివ్వెరపోయాడు. అధికార మదంతో ఓ సభలో విధి నిర్వహణలో ఉన్న ప్రభుత్వ ఉద్యోగులపైనే నోరు పారేసుకోడంపై విమర్శలు వెలువెత్తుతున్నాయి. ఎంత అధికారం ఉంటే మాత్రం కనీసం తన కన్నా వయస్సులో పెద్దవాడి గౌరవం లేకుండా మాట్లడం ఏమింటంటూ.. చింతమనేని తీరుపై సోషల్ మీడియాలో విమర్మలు వెల్లువెత్తుతున్నాయి.

 

English Title
TDP MLA Chintamaneni Prabhakar scolds

MORE FROM AUTHOR

RELATED ARTICLES