ఓ అజ్ఞ‌తావాసి.. అజ్ఞానం వీడు

ఓ అజ్ఞ‌తావాసి.. అజ్ఞానం వీడు
x
Highlights

జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ ప్ర‌శ్నించే స్టైల్ మార్చారు. టీడీపీ తో స‌న్నిహితంగా ఉన్న ప‌వ‌న్ విమ‌ర్శ‌లు చేయ‌డంతో ఆ పార్టీ నేత‌లు షాక్ తిన్నారు....

జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ ప్ర‌శ్నించే స్టైల్ మార్చారు. టీడీపీ తో స‌న్నిహితంగా ఉన్న ప‌వ‌న్ విమ‌ర్శ‌లు చేయ‌డంతో ఆ పార్టీ నేత‌లు షాక్ తిన్నారు. నాలుగేళ్లుగా త‌నతో స్నేహం చేసిన ప‌వ‌న్ ఒక్క‌సారిగా స్టాండ్ మార్చొకోవ‌డాన్ని జీర్ణించుకోలేక‌పోతున్నారు. ఈ నేప‌థ్యంలో ప‌వ‌న్ క‌ల్యాణ్ పై చంద్ర‌బాబుతో స‌హా నేత‌లు కూడా ప‌వ‌న్ ను త‌మదైన శైలిలో విమ‌ర్శ‌లు చేస్తున్నారు.
విళంబినామ సంవ‌త్స‌రం సంద‌ర్భంగా మీడియాతో మాట్లాడిన ప‌లువురు నేత‌లు ప‌వ‌న్ క‌ల్యాణ్ తీరుపై మండిప‌డుతున్నారు. విళంబి నామ సంవ‌త్స‌రం కొత్త‌గా ఉన్న‌ట్లే రాజ‌కీయాలు కొత్త‌గా ఉంటాయ‌ని ఎంపీ శివ‌ప్ర‌సాద్ అన్నారు. ఇక ఏపీకి ప్ర‌త్యేక‌హోదా ఇవ్వ‌క‌పోవ‌డంతో బీజేపీతో క‌టిఫ్ చెప్పి ..అవిశ్వాస తీర్మానం పెట్ట‌డంతో .. సీఎం చంద్రబాబు ప్రపంచవ్యాప్తంగా పేరు తెచ్చుకున్న గొప్ప నేత ..కాబ‌ట్టే తాము పెట్టిన అవిశ్వాసానికి రోజురోజుకు మద్దతు పెరుగుతోందన్నారు. గ‌త ఎన్నిక‌ల నుంచి త‌మ‌కు మ‌ద్ద‌తు ప‌లికిన‌ ప‌వ‌న్ క‌ల్యాణ్..ఇప్పుడు మాట మార్చి పూట‌కో మాట మాట్లాడుతూ ప‌బ్బం గ‌డుపుకుంటున్నార‌ని విమ‌ర్శించారు. ఇక పీఎం మోడీ సీఎం చంద్ర‌బాబును అణ‌గ‌దొక్కే ప్ర‌య‌త్నం చే్స్తున్నార‌ని సూచించారు.
ప‌వ‌న్ చేసిన వ్యాఖ్య‌ల‌పై డిప్యూటీ సీఎం కేఈ కృష్ణ మూర్తి మండిప‌డ్డారు. అజ్ఞాత వాసి ..అజ్ఞానం వీడాల‌ని పవ‌న్ కు సూచించారు. ప్ర‌స్తుతం త‌నకున్న అజ్ఞానం వ‌ల్లే చంద్ర‌బాబును విమ‌ర్శిస్తున్నార‌ని చెప్పుకొచ్చారు. ఎన్డీఏ ప్ర‌భుత్వంపై తాము అవిశ్వాసం పెడితే గంట‌లోనే 16పార్టీలు మ‌ద్ద‌తు ప‌లికాయ‌ని సూచించారు.
మంత్రి అమ‌ర్నాథ్ రెడ్డి పీఎం మోడీపై విమ‌ర్శ‌నాస్త్రాలు సంధించారు. దేశంలో మోడీకి పోటీగా చంద్ర‌బాబు ఉన్నారు కాబ‌ట్టే ఏపీపై క‌క్ష సాధింపు చ‌ర్య‌ల‌కు పాల్ప‌డుతున్నార‌ని ఆరోపించారు. గుజ‌రాత్ ను ఏపీ మించుపోతుంద‌ని మోడీ భావిస్తున్నార‌ని అన్నారు. త‌మిళ‌నాడులో ప‌ట్టుకోసం ప్ర‌య‌త్నం చేస్తుంద‌ని ..ఆలాంటి రాజ‌కీయాలు ఏపీలో కుద‌ర‌వ‌ని అన్నారు.
సీఎంపై, లోకేష్‌పై పవన్ చేసిన ఆరోపణలను ఆయన ఖండించారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం పోరాడటం వల్లే వెంకయ్యను పథకం ప్రకారం మంత్రివర్గం నుంచి తప్పించారన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories