వైసీపీలో చేరిన జేసీ అనుచరుడు, మాజీ ఐపీఎస్ అధికారులు!

Submitted by nanireddy on Tue, 06/12/2018 - 08:03
tdp leader kogatam vijayabaskar reddy joined in ycp

 పశ్చిమగోదావరి జిల్లాలో జరుగుతున్న ప్రజాసంకల్ప యాత్రలో వైసీపీ అధినేత జగన్ సమక్షంలో పలువురు నేతలు ఆ పార్టీ తీర్ధం పుచ్చుకున్నారు. ప్రముఖంగా అనంతపురం పార్లమెంటు సభ్యుడు జేసీ దివాకరరెడ్డి ముఖ్య అనుచరుడు  కోగటం విజయభాస్కరరెడ్డి, రిటైర్డ్‌ ఐపీఎస్‌ అధికారులు ఇక్బాల్‌ (కర్నూలు), లక్ష్మిరెడ్డి(వైఎస్సార్‌ కడపజిల్లా) తదితరులు వైసీపీలో చేరారు. ఇదిలావుంటే జగన్ పాదయాత్ర మంగళవారం తూర్పు గోదావరి జిల్లాలోకి ప్రవేశించనుంది. పశ్చిమలో మొత్తం 316.9 కిలోమీటర్ల మేర పాదయాత్ర సాగించిన జగన్ నేడు కొవ్వూరు రోడ్డు కమ్‌ రైల్‌ బ్రిడ్జి ద్వారా తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో ప్రవేశించనున్నారు. ఈ సందర్భంగా పార్టీ శ్రేణులు  భారీ ఎత్తున స్వాగత ఏర్పాట్లు చేశారు.

English Title
tdp leader kogatam vijayabaskar reddy joined in ycp

MORE FROM AUTHOR

RELATED ARTICLES