సీఎం చంద్ర‌బాబును తిడితే ప‌ద‌వులు ఖాయం : క‌విత‌

సీఎం చంద్ర‌బాబును తిడితే ప‌ద‌వులు ఖాయం : క‌విత‌
x
Highlights

గత కొన్నేళ్ళుగా తెలుగుదేశం పార్టీలో సభ్యురాలిగా వ్యవహరిస్తున్న సినీ నటి, పార్టీ రాష్ట్ర మహిళా నాయకురాలు కవిత పార్టీకి గుడ్ బై చెప్పి బీజేపీలో చేరారు....

గత కొన్నేళ్ళుగా తెలుగుదేశం పార్టీలో సభ్యురాలిగా వ్యవహరిస్తున్న సినీ నటి, పార్టీ రాష్ట్ర మహిళా నాయకురాలు కవిత పార్టీకి గుడ్ బై చెప్పి బీజేపీలో చేరారు. ఆదివారం విజయవాడలో జరిగిన బీజేపీ కోర్ కమిటీ సమావేశంలో ఆమె బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. కవిత కమలం గూటికి వెళతారని గతంలో పెద్దఎత్తున వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఆదివారం టీడీపీకి సడన్ షాకిచ్చి బీజేపీ గూటికి చేరుకున్నారు. ఏపీ బీజేపీ అధ్యక్షుడు, విశాఖ ఎంపీ హరిబాబు.. కవితకు కండువా కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు.
టీడీపీ నుంచి గెంటివేయబడ్డాను..!
కమలం గూటికి చేరిన అనంతరం కవిత మీడియాతో మాట్లాడుతూ.. ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రవేశపెట్టిన పథకాల స్ఫూర్తితో బీజేపీలో చేరానని స్పష్టం చేశారు. అయితే తాను టీడీపీ నుంచి బయటకు రాలేదనీ… ఆ పార్టీ నుంచి గెంటి వేయబడ్డానని అని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. టీడీపీ బలోపేతానికి అహర్నిశలు కష్టపడ్డానని, టీడీపీలో అనేక అవమానాలు ఎదుర్కొన్నానని, చంద్రబాబును తిడుతున్నవారికి పదవులిచ్చారే తప్ప పార్టీ కోసం పనిచేసినవారికి మొండిచేయి చూపారని కవిత వ్యాఖ్యానించారు. ఇదిలా ఉంటే బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు.. చాలా మంది మాతో టచ్‌లో ఉన్నారు.. టీడీపీతో సహా పలు పార్టీల నేతలు వాళ్లంతా బీజేపీలోకి రావడానికి సిద్ధంగా ఉన్నారని మీడియాకు వివరించిన సంగతి తెలిసిందే. అయితే కవిత తర్వాత కమలం గూటికి ఇంకెవరొస్తారన్నదానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.
తీవ్ర అసంతృప్తితోనే..!
సినీ నటి కవిత త్వరలో తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేస్తారని గత కొద్దరోజులుగా పెద్దఎత్తున పుకార్లు వచ్చిన సంగతి తెలిసిందే. అంతేకాకుండా పార్టీలో ఆర్య వైశ్యులకు తీవ్ర అన్యాయం జరుగుతోందని ఆమె అసంతృప్తికి లోనయ్యారని తెలుస్తోంది. పార్టీలో కష్టపడిన వారికి గుర్తింపు లభించడం లేదన్న ఆగ్రహంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఇదే విషయాన్ని తన అనుచరుల వద్ద పలుమార్లు కవిత ప్రాస్తావించినట్లు తెలిసింది. పార్టీలో ఎమ్మెల్సీ పదవులతో పాటు నామినేటెడ్ పదవులు వైశ్యులకు దక్కలేదని, తనకు ఎమ్మెల్యే సీటిస్తానని చెప్పి కూడా ఇవ్వలేదని ఆమె అసంతృప్తిని వ్యక్తం చేశారని సమాచారం. ఎన్టీఆర్ ఉన్నప్పటి టీడీపీ, ఇప్పుడున్న పార్టీకి పోలిక లేదని కూడా వ్యాఖ్యానించారని సమాచారం.
మహానాడులో అవమానంతో కలత చెందిన కవిత..!
అధికారం లోకి రానప్పుడు తనకు ఎంతో గౌరవం ఇచ్చారని , పార్టీకి సంబదించిన ఏ చిన్న మీటింగ్ జరిగిన తనకు ఆహ్వానం అందించేవారని, ఇప్పుడు అధికారం లోకి వచ్చాక పూర్తి గా నన్ను పక్కన పెట్టారని వాపోయింది. ఈ సంవత్సరం మహానాడులో తనను అవమానించారని, తనతో కన్నీరు పెట్టించారని కవిత వాపోయిన సంగతి తెలిసిందే. ”తెలుగుదేశం పార్టీలో మహిళలకు కనీస గౌరవం లేదు.. సినిమా వాళ్లంటే మరీ చిన్నచూపు.. గడిచిన మూడేళ్లుగా ఎన్నో అవమానాలకు గురిచేశారు.. చేస్తున్నారు.. చాలా క్షోభపెట్టారు. ఇలాంటి పార్టీలో ఎందుకు ఉండాలి.. అందుకే ఇక ఈ పార్టీ లో కొనసాగ దాల్చుకోలేదని తెలిపింది. తెలుగుదేశం పార్టీ మహానాడులో జరిగిన అవమానం తర్వాత పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు. అప్పట్లో బీజేపీ వైపు చూస్తున్నట్టు కూడా కొన్ని కథనాలు వచ్చాయి.
కమలం గూటికి కవిత
మహానాడులో జరిగిన అవమానం అనంతరం ఆమె పార్టీ కార్యక్రమాలకు చాలా దూరంగా ఉంటున్నారు. అంతేకాదు అప్పట్లోనే బీజేపీ గూటికి చేరాలంటూ ఆమె ప్రయత్నాలు కూడా చేశారు. ఆ క్రమంలో తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు లక్షణ్‌‌తో భేటీ అయ్యారు. అయితే అప్పట్నుంచి వేచి చూసిన కవిత ఎట్టకేలకు కమలం గూటికి చేరుకున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories